బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా గోమందిరం ప్రారంభం -టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

0 8,483

తిరుపతి ముచ్చట్లు:

తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద దాత శ్రీ శేఖ‌ర్‌రెడ్డి రూ.15 కోట్ల విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని గోమందిరం, పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి, డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను బుధ‌వారం ఈవో ప‌రిశీలించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గోమందిరంలో గోప్ర‌ద‌క్షిణ‌, గోతులాభారం, గోవు ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. బ‌ర్డ్ ఆసుప‌త్రి ఆవ‌ర‌ణంలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, వైద్య ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకుని, వైద్యుల నియామ‌కం కోసం నోటిఫికేష‌న్ జారీ చేశామ‌ని చెప్పారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీకి తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Gomandiram inaugurated by Chief Minister at Brahmotsaval – TTD Evo Dr. KS Jawahar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page