కేసీఆర్ తోనే గౌడలకు ఆదరణ, గౌరవం

0 8,488

హుజూరాబాద్ ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లొ గౌడ ఆత్మీయ సభ టి ఆర్ ఎస్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో  నియోజకవర్గ పరిధిలో వేలాదిమంది గౌడ సంఘాల ఆధ్వర్యంలో భారీగా గౌడ్ లు తరలివచ్చారు.  సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరణ, గౌడ కమ్యూనిటీ హాలు కు భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్,  గంగుల కమలాకర్, ఎమ్మెల్యే లు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్, వివేక్ గౌడ్, వి.సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,గంగాధర్ గౌడ్,    టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ లు ఎల్లమ్మ, సర్దార్ పాపన్న వారసులం, మాట తప్పరు. తెలంగాణ వచ్చాక గౌడ్ ల ఆర్థిక పరిస్థితులు మారాయి. గీత వృత్తిని నమ్ముకున్న వారు ప్రజలకు సేవకులు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ లేని పరిస్థితి. గొప్ప పవిత్రమైన జాతి గౌడ జాతి. కరోనా సమయంలో కుడా గౌడ లకు ఆదరణ లభించింది. వృత్తిని వేధించిన వారి నుండి కేసీఆర్ రక్షించారు. పన్నులు రద్దు చేశారు. బ్రాందీ షాప్ ల ల్లో 15 శాతం 355 దుకాణాలు గౌడ్ లకు రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ప్రకటన చేశారు. కేసీఆర్, టిఆర్ఎస్ తోనే గౌడ్ కులం కు ఆదరణ లభించిందని అన్నారు.
హైదరాబాద్ లో గౌడ్ లకు స్థలం కేటాయింపు చేశారు. బీజేపీలో బీసీ లకు ఆదరణ లేదు. కేంద్రంలో ఒక్క మంత్రి ఇవ్వని పార్టీ బీజేపీ. బీసీ లకు బీజేపీ ఏం చేయలేదు, చేయని పార్టీ,  చర్చకు సిద్ధం, జాతీయ పార్టీలకు ఓటు వేస్తే ఏం రాదు. గౌడన్న లకు మోపెడ్ లను ఇస్తాం. అత్యధిక మెజార్టీతో గెల్లు ను గెలిపించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Gowdala popularity and respect with KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page