ఆస్పత్రికి రోగుల తాకిడి

0 9,714

హైద్రాబాద్‌ ముచ్చట్లు:

 


పేదల దవాఖానగా చెప్పుకునే కోరంటి ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతుంటే.. నిర్లక్ష్యం నిలువెత్తునా దర్శనమిస్తోంది. దీనికిగోడు పర్యవేక్షణా లోపం రోగులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఓవైపు కరోనా.. మరో వైపు సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. కానీ రోజువారీ ఓపీ ఎంత, ఎన్ని సీజనల్‌ వ్యాధుల కేసులు నమోదయ్యాయి అనే వివరాలు మాత్రం ఆస్పత్రి వర్గాల వద్ద లేవంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఏ చిన్న సుస్తీ చేసినా మొదటగా నగరవాసులకు గుర్తొచ్చేది వందేండ్ల చిరిత్ర గల కోరంటి ఆస్పత్రి. కరోనాకు ముందు 1800-2000 వరకు ఓపీ ఉండేది. సీజనల్‌ కాలంలోనైతే ఇంకాస్త ఎక్కువే ఉండేది. ప్రస్తుతం 300 వరకు ఉంటోంది. ఇది కూడా రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా తర్వాత సాధారణ ఓపీతోపాటు కొవిడ్‌ బాధితులకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ 100 మందికి కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రిలో చేర్చుకుని చిక్తిత్స అందిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా సీజనల్‌ వ్యాధుల విషయంలోనే ఆస్పత్రి వర్గాల వద్ద స్పష్టత లేదు. ఈ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రికి ప్రతిరోజూ ఎంత ఓపీ ఉంటుంది? ఏయే వ్యాధితో ఎంత మంది ఆస్పత్రిలో చేరుతున్నారు? జనవరి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సీజనల్‌ వ్యాధుల కేసులు నమోదయ్యాయి అనే వివరాలు మాత్రం ఆస్పత్రి వర్గాల వద్ద లేనట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని చెప్పడానికి సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారు. రోజువారీగా నోటీసు బోర్డుపై ఓపీ ఎంత, ఐపీ ఎంత, మరణాలు ఎన్ని అనే వివరాలను పొందుపర్చాల్చి ఉంటుంది. కానీ ఇవేవీ కోరంటి ఆస్పత్రిలో అమలుకు నోచుకోవడం లేదు. కరోనా పేరుతో కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. 2019లో నమోదు చేసిన వివరాలే నేటికీ నోటీసు బోర్డుపై దర్శనమిస్తున్నాయి.

 

 

 

- Advertisement -

జిల్లా ఇన్‌చార్జి మలేరియా అధికారి నిరంజన్‌ వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 మలేరియా, 38 చికెన్‌ గన్యా, 134 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కొన్ని కోరంటి ఆస్పత్రిలో ఉండే ఉంటాయి. కానీ ఆస్పత్ర్రి వర్గాలు మాత్రం ఈ లెక్కలను బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. కరోనా లెక్కల్లా సీజనల్‌ వ్యాధుల వివరాలను కూడా గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అసలు ఆస్పత్రిలో సీజనల్‌ వ్యాధులకు చికిత్స అందిస్తున్నారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఐపీఎం (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెన్‌టివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ టేబరేటరీస్‌)కు కూడా డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. దీంతో ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఫలితంగా కోరంటి ఆస్పత్రిపై పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదునుగా భావించిన ఆస్పత్రి వర్గాలు రోగులను సరిగా పట్టించుకోవడం లేదనే వివర్శలు వినిపిస్తున్నాయి. వారంలో కొన్ని రోజులు ఐపీఎం, మరికొన్ని రోజులు కోరంటి ఆస్పత్రిలో ఉంటున్నారు. దీనికి కరోనా తోడు కావడంతో రోగులకు అస్సలు అందుబాటులో ఉండటం లేదు. రోజుకు కనీసం రెండు సార్లు ఆస్పత్రిలో రౌండ్స్‌ వేయాల్సి ఉంటుంది.

 

 

 

కానీ ఇవేవీ కోరంటిలో జరగడం లేదు.ఏ ఆస్పత్రిలోనైనా సూపరింటెండెంట్‌ తర్వాత బాధ్యులుగా ఆర్‌ఎంఓ ఉంటారు. కానీ కోరంటిలో మాత్రం ఆర్‌ఎంఓ ఉన్నా లేనట్టుగానే ఉంది. ఎప్పుడు చూసినా క్యాబిన్‌లో ఉంటారనీ, రౌండ్లకు వెళ్లరనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఆస్పత్రికి రోజు ఎంత ఓపీ ఉంటుంది? ఎన్ని సీజనల్‌ వ్యాధుల కేసులు నమోదయ్యాయి, ఇంత వరకు ఎంత మంది మృతి చెందారు? ఎంత మంది సాధారణ రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు? అనే వివరాలు కూడా ఆ అధికారికి తెలియవు. దీన్ని బట్టి చూస్తే ఆర్‌ఎంఓ ఉన్నా లేనట్టుగానే భావించాల్సి వస్తోంది. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడ మేంటని రోగులు, వారి సహాయకులు ప్రశ్నిస్తున్నారు. కరోనా సాకుతో రోగులను దూరం నుంచే పర్యవేక్షించి పంపిచేస్తున్నట్టు సమాచారం. వైద్యులే ఇలా భయపడితే ఇక సాధారణ ప్రజానీకం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ పద్దతిని మార్చుకుని రోగులకు సరైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

 

Tags: Patient onslaught to hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page