ఆహ్లాదమా… చిరునామ ఎక్కడ

0 9,691

నిజామాబాద్ ముచ్చట్లు:

 

ఆహ్లాదం కరువవుతోంది.పర్యావరణాన్ని వెదజల్లాల్సిన పార్కులు పచ్చదనం కోల్పోతున్నాయి. నిధుల కొరత కారణంగా కొత్త పార్కులు గార్డెన్ ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.మరో వైపు పార్కులు ప్రజా అవసరాల కోసం కేటాయించిన విలువైన స్థలాలు కబ్జా కోరల్లో చిక్కు కుంటున్నాయి.కొత్త పార్కుల ప్రతిపాదనలు ఆటకెక్కాయి.అందుబాటులో ఉన్న పార్కులు నిరాధారణకు గురవుతున్నాయి.
నిజామాబాద్ నగర జనాభా 4 లక్షలు.80 వేలకు పైగా గృహ సముదాయాలు న్నాయి.రోజు రోజుకు జనాభా పెరుగు తోంది.దానికి అనుగు ణంగా నగరం విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్త కొత్త కాలనీ లు వెలుస్తున్నాయి. ఉద్యోగాలు వ్యాపారాలు పిల్లల చదువులు కోసం చాలా కుటుంబాలు పల్లెల నుంచి నగరానికి వలస వస్తున్నాయి.గతం లో 50 డివిజన్లు ఉండగా సమీప గ్రామాల విలీనం తో డివిజన్ల సంఖ్య 60 కి పెంచారు.పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా సౌకర్యాలు సమకూరడం లేదు.నగరవాసికి ఆహ్లాదం కరువైంది. ప్రభుత్వం ఉద్యాన వనాల ఏర్పాటుకు నిధులు కేటాయించినా కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని పార్కులు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. పర్యవేక్షణ లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వారాంతాల్లో కుటుంబంతో సరదాగా గడపేందుకు సరైన పార్కులు లేకపోవడం పట్ల నగర వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పార్కుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నగరంలో మొత్తం 110 పార్కు స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.నగర పాలక సంస్థ పరిధిలోని 4 లక్షల జనాభా ఉండగా సరైన పార్కు ఒక్కటీ ప్రజలకు అందుబాటులో లేదు. 60 డివిజన్లలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

 

 

- Advertisement -

సంజీవయ్యకాలనీ, విద్యుత్తునగర్,  సుభాష్ నగర్ తోపాటు మరికొన్ని చోట్ల పార్కుల స్థలాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వాటిలో కావాల్సిన మొక్కలు నాటారు. అయితే నడక కోసం ట్రాక్,కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. పట్టణ ప్రగతిలో భాగంగా 4 కోట్లతో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంకా స్థలాలు ఎంపిక చేయలేదు. ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.పలు చోట్ల నిర్మిస్తున్న పార్కుల పనులు అసంపూర్తిగా మిగల డంతో అవస్థలు తప్పడం లేదు. మారుతినగర్ లో 67లక్షలతో అమృత్ నిధుల తో పార్కును అభివృద్ధి చేయాలని 2019 లో శంకు స్థాపన చేశారు.సుమారు 5లక్షలతో ప్రహారీ నిర్మించి వదిలేశారు. గౌతంనగర్ లో ఒక కోటి 25లక్షల తో ఉద్యాన  వనాన్ని అభివృద్ధి చేయాలని 2017లో శంకు స్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. వినాయక్ నగర్ షిరిడీ సాయికృపానగర్ లో  ఉద్యానవనం ఏర్పాటు పనులు ముందుకు సాగడం లేదు.సుభాష్ నగర్ లో 5లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పార్కు పదేళ్ల నుంచి వృథాగా ఉంది.నగరం లోని కోటగల్లీ, గోనెరెడ్డి కాలనీ పార్కులు ఆనవాళ్లు కోల్పో యాయి.మరోవైపు పచ్చదనం కనిపించ డం లేదు.పిల్లలఆట వస్తువులు తుప్పుపట్టి వెక్కిరిస్తున్నాయి.కొత్తపార్కు నిర్మించేందుకు ఉన్న చెట్లన్నిటిని కొట్టేశారు.వాకింగ్ ట్రాక్ కూడా కొత్తగా అందుబాటు లోకి వస్తుందని సంబరపడ్డారు.కానీ అందుబాటులో ఉన్న పాతపార్కు లేక కొత్తపార్కు నిర్మాణం జరుగకపో వడం తో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతు న్నారు.పార్క్ అభివృద్ధి నిర్వహణ కోసం కాలనీ వాసులు ఓ కమిటీ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్లారని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టడం లేదని వారు వాపోతున్నారు.మరోవైపు ప్రగతి నగర్,ఖళీల్ వాడి, వినాయక్ నగర్, పార్కులదీ అదే పరిస్థితి. నిర్వహణ సరిగా లేక వ్యాయామం ఆటవస్తువులు శిథిలావస్థకు చేరాయి.

 

 

 

 

ప్రహరి గోడలు కూలిపోయాయి.గేట్లు విరిగిపోయాయి.కొన్ని చోట్ల పార్కులు మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోతున్నాయి.ఇదిలా ఉండగా పార్క్ స్థలాలు యథేచ్ఛగా అన్యా క్రాంతమవుతున్నాయి. నగర శివారులో కొత్త గా ఏర్పడిన రియల్ ఎస్టేట్ వెంచర్ల లో లేఔట్ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి 10 శాతం భూమిని కేటాయించా లి.సదరు భూమిని ఆయా కాలనీ లో పార్కు కమ్యూనిటీ హాల్ లేదా ఇతర ప్రజా అవసరాల కోసం వినియో గించాలి.ఇలాంటి భూముల్లో ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టారాధని నిబంధనలు ఉన్నాయి.అంతే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారి కి కూడా మున్సి పాలి టీ కి వదిలిపెట్టిన భూమిపై ఎలాంటి హక్కులు ఉండవు. కానీ కొందరు వదిలిపెట్టిన  10 శాతం భూమిని కూడా ప్లాట్లు గా మార్చేస్తున్నారు.రాత్రికి రాత్రే గుట్టు చప్పురు కాకుండా వాటిని విక్రయిస్తున్నారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకుని రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ సదరు భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు.పెద్ద పెద్ద బిల్డింగ్ లు నిర్మిస్తున్నారు. మరి కొన్ని చోట్ల పార్క్ భూములు కబ్జా అవుతు న్నాయి. నగరం లోని చంద్ర శేఖర్ కాలనీ, గౌతమ్ నగర్, గంగాస్తాన్,మారుతి నగర్, బైపాస్ రోడ్డు కంటేశ్వర్, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల్లో పార్క్ స్థలాలు వివాదాల్లో చిక్కుకు న్నాయి.ఇండ్ల మధ్య లో ఉన్న వాటిని అక్కడి వారు ఆక్రమి స్తుండగా మరి కొన్ని చోట్ల ఈ మాదే అంటూ ఫేక్ డాక్యు మెంట్లు సృష్టించి పాగా వేస్తున్నారు.భూముల ధరలు పెరుడం తో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఖాళీ జాగ లపై కన్నెస్తున్నారు కొందరు అక్రమార్కులు.నగరం చుట్టూ సుమారు 50 ఎకరాల వరకు సర్కారు భూములు, పార్క్  స్థలాలు కబ్జా అయినట్లు తెలుస్తోంది. వీటి వికువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా.ప్రజలకు ఆహ్లాదా న్ని పంచాల్సిన పార్కులు పార్కు స్థలాలు చాలా చోట్ల వివాదాల మధ్య నలిగిపోతు న్నాయి. రెవెన్యూ మున్సిపల్ అధికా రులకు అనేక ఫిర్యాదు లు వస్తున్నా రాజకీయ ఒత్తిళ్ల తో తనిఖీ లు చేయడం లేదని వెనక్కి తగ్గుతున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి.

 

 

అయితే ఇటీవల పట్టణ ప్రగతిలో భాగంగా నగరం లో ప్రధాన రోడ్లు ఖాళీ స్థలాల్లో ఒక యజ్ఞం లా మొక్కలు నాటారు.కానీ పురాతన పార్కుల్లో మాత్రం అభివృద్ధి చేయాల్సి ఉండటం తో మొక్కలు నాటలేదు. అందుబాటులో ఉన్న  పార్కుల నిర్వహణ పై కూడా దృష్టి పెట్టడం లేదని విమర్శలున్నాయి.పిల్లలతో కలిసి వీకెండ్ లో సేద తీరేందుకు అనువైన పార్కు లు లేవని నగర వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ పార్క్ ను అటవీ శాఖ ఎక్కడో అడవుల్లో నిర్మించింద ని అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు.నగర సుందరీ కరణపై అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా  ప్రత్యేక దృష్టి పెట్టారు.ప్రధాన రోడ్లు కూడళ్ల లో డివైడర్లు నిర్మించి మొక్కలు నాటారు.విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్కులను కూడా పట్టించు కోవాలంటున్నారు స్థానికులు.అయితే నిధుల కొరత వల్ల పార్క్ ల నిర్మాణాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఎమ్మెల్యే గణేష్ గుప్తా చెప్తు న్నారు.పార్క్ స్థలాలను గుర్తించామని వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Pleasant … where is the address

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page