రేవంత్ రెడ్డి నివాసంపై దాడికి నిరసనగా…

0 8,754

-‘మెట్ పల్లిలో కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

కోరుట్ల ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంపై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మెట్ పల్లి పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.మెట్ పెల్లి
పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు మహ్మద్ కుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం వారి ఘుండాయిజానికి నిదర్శనమన్నారు. అనవసరంగా తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతున్న విషయం గుర్తించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు ఉద్దేశపూర్వకంగానే ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంపై కార్యకర్తలచే దాడి చేయించారు అన్నారు. ఈ చర్య ఎంతో సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, వారు అవసరమైన సందర్భంలో తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నీచమైన పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఉపసర్పంచ్ జెట్టి లింగం, కోరుట్ల నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షులు రాంప్రసాద్, పట్టణ యూత్ అధ్యక్షులు జట్టి లక్ష్మణ్ ,కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు కొమ్ముల సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ యూత్ నాయకులు కోటగిరి చైతన్య ,మహమ్మద్ ముఖీం, రంగుల అశోక్ ,హరీష్, జుబేర్ ,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Protesting against the attack on Rewanth Reddy’s residence …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page