ఆశ్వారావుపేటలో రెచ్చిపోయిన లేడీ కిలాడిలు

0 33

భద్రాచలం     ముచ్చట్లు:

వాళ్ళు లేడీలు కాదు కేడీలు.  అందరూ ఉన్నారు అన్నిటికంటే ఓ కంటా సీసీ కెమెరాలు కనిపెడుతున్నాయని తెలుసు.  అయిన పోలీసులు ఎప్పుడు రావాలి ఈ సీసీ ఫుటేజ్ ఎప్పుడు తియ్యాలి.  ఒకవేళా తీసిన మేము దొరికేనా, అనుకున్నారేమో ఏమో పట్టపగలు  ఏకంగా ఓ బ్యాంక్ లో ముగ్గురు ఆడవాళ్లు కలిసి బ్యాంక్ లో డబ్బులు దాచుకోవడం కోసం వచ్చిన మహిళ వద్ద 30 వేలు డబ్బులు కాజేశారు. ఆపైన, మరో మహిళ కుదవా పెట్టిన బంగారం విడిపించుకుందమని వెళ్లిన  దగ్గర ఆమెనుంచి కూడా మరో 50 వేలు కాజేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగింది. అశ్వారావుపేట మండలం బిల్లుడి గూడెం గ్రామానికి చెందిన జెట్టి మంగమ్మా అనే మహిళ అశ్వారావుపేట మండలం వినాయకపురం యూనియన్ బ్యాంక్ నందు డబ్బులు డిపాజిట్ చేసుకుందామని వచ్చి డినమినేషన్ కోసం మంగమ్మ వద్ద ఉన్నా 30 వెల రూపాయలను లెక్కవేయడం చూసి  చాలా చాకచక్యంగా ఆలోచించి మంగమ్మ క్యాషియర్ దగ్గరకు వెళ్ళే వరుకు వేచి చూసి అక్కడికి వెళ్ళాక జనం రద్దీగా ఉండడంతో రద్దీగా ఉన్న క్యూ లైన్లో నుంచున్నా  మంగమ్మను ముగ్గురు మహిళలు,ఓ ఇద్దరు పసి పిల్లలు చుట్టుముట్టి చేతులో ఉన్నా సంచిని కోసి డబ్బులు కొట్టేశారు. అలానే అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామానికి గ్రామానికి మడకం కుమారి అనే మహిళ అశ్వారావుపేట పట్టణంలో ఓ ఫైనాన్స్ దుకాణంలో కుదవా పెట్టిన బంగారాన్ని  విడిపించేందుకు వెళ్లగా ఆ షాప్ యజమని కొద్దీ సేపు సమయం పడుతుందని చెప్పడంతో  దుకాణం బయట కూర్చున్న వారి వద్ద నుండి  వారికి తెలియకుండానే  ముగ్గురు ఆడవాళ్లు వాళ్ళను మాటల్లోకి దింపి వారి వద్ద ఉన్నా మరో 50 వేలు రూపాయలను కాజేశారు. ముఖ్య విషయమేమిటంటే వినాయకపురంలో ఉన్న యూనియన్ బ్యాంక్ నిత్యం జనాలు రద్దీగా ఉండే ప్రదేశంలోనే ఉంటుంది, అలానే అశ్వారావుపేట లో ఫైనాన్స్ దుకాణం కూడా పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఇలా జనాలు రద్దీగా ఉన్నా ప్రదేశాల్లో అలానే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే  ఇన్ని దొంగతనాలు చేస్తే అశ్వారావుపేట రురల్ ఏరియాలో ఇంకా ఎన్ని జరిగి ఉండచ్చు అనేది పెద్ద  మిస్టరీగా మారింది. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా ఈ కిలాడి లేడీలు ఇంకా ఎన్నిచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారో  తెలియాల్సి ఉంది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Provoked Lady Kiladilu in Aswaraupeta

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page