ప్రశాంతంగా ముగిసిన పాఠశాలల చైర్మన్ ఎన్నికలు

0 9,914

రామసముద్రం ముచ్చట్లు:

 

మండలంలోని అన్ని పాఠశాలల్లో కమిటీ చైర్మన్ల ఎన్నిక బుధవారం ప్రశాంతంగా ముగిసాయి.  మండలంలో ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లు, ఒక కస్తూరిబా పాఠశాల, ఒక ఏ పి మోడల్ స్కూల్, ప్రాథమిక పాఠశాల లు 61, ప్రాథమికోన్నత పాఠశాలలు 12 ఉన్నాయి. రామసముద్రం జెడ్పీహై స్కూల్ కమిటీ చైర్మన్ గా రమ్య మంజునాథ్, చెంబకూరు జెడ్పీహై స్కూల్ చైర్మన్ గా మోషీనా ,కె సి పల్లె జెడ్పీహై స్కూల్ చైర్మన్ గా అరుణ, గుంత యంబాడీ పాఠశాల చైర్మన్ గా గెంగిరెడ్డి, గుండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల చెర్మెన్ గా వేణుగోపాల్ రెడ్డి, అరికేల జెడ్పీ హై స్కూల్ చైర్మన్ గా వెంకటరమణ, ఏ పి మోడల్ స్కూల్ కమిటీ ఛైర్మన్ గా గుణశేఖర్, తిరుమల రెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాల కమిటీ చైర్మన్ గా శ్రీనివాసులురెడ్డి అలాగే అన్ని పాఠశాలలలో చైర్మన్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎం ఈ ఓ హేమలత తెలిపారు. కేసి పల్లి పంచాయతీ లో ఎంపీటీసీ లాయర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో చెర్మెన్ లను ఎంపిక చేయడం జరిగింది. రామసముద్రం మరియు ఏ పి మోడల్ స్కూల్ లో ఎన్నికైన కమిటీ ఛైర్మన్ లను మండల వై సి పి కన్వీనర్ భాస్కర్ గౌడు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, ఎం పిటి సి లు లాయర్ రమణారెడ్డి, రెడ్డిశేఖర్, సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు, ఉదయ్ శంకర్ రెడ్డి, నాయకులు కొండూరు కృష్ణారెడ్డి, నంద, మంజునాథ్ రెడ్డిలు అభినందించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: School chairman elections that ended peacefully

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page