చౌడేపల్లె ఉన్నతపాఠశాల పీఎంసీ కమిటీ చైర్మన్‌గా శంకర్‌రెడ్డి

0 9,709

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక ఉన్నతపాఠశాల పీఎంసీ కమిటీ చైర్మన్‌ శంకర్‌రెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని 77 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పీఎంసీ కమిటీ ఎన్నిలు నిర్వహించామని తెలిపారు. మండలంలోని 62 పాఠశాలల్లో కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోగా 15 పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయని , ప్రశాంత వాతావరణం నడుమ కమిటీ ఎన్నికలను పూర్తిచేశామన్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్‌లు, కమిటీ సభ్యులు ప్రభుత్వ ఆశయసాధనకు పోటీ తత్వంతో సేవ చేసి ఆయా పాఠశాలల అభివృద్దికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, ఎంపీటీసీ నరసింహులు యాదవ్‌, కళ్యాణ్‌భరత్‌ తదితరులున్నారు. కమిటీ సభ్యులను, చైర్మన్‌ను ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిథులు సన్మానించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Shankarreddy is the Chairman of the PMC Committee of Choudepalle High School

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page