నెల్లూరు జిల్లాలో మరో విషాదం

0 10

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది.  కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా అందులో ఇద్దరు చనిపోగా ఒక పాప పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కుటుంబం మొత్తం విషం సేవించారు. ఈ ఘటనలో   మేర్లపాక మురళి (40), అయన తల్లి  మస్తానమ్మ(60)  చనిపోరు.  కుమార్తె కావ్య శ్రీ (11) ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు సమాచారం.
మేర్లపాక మురళి ఇంట్లో ఏదో శబ్దాలు రావడంతో ఇది గమనించిన స్థానికులు ఇంటిదగ్గర కి వెళ్ళి  చూడగా అప్పటికే మస్తానమ్మ(60) చనిపోయి ఉంది. మురళి(40) కావ్య శ్రీ(11) కొన ఊపిరితో ఉండడంతో వీరిని హుటాహుటిన సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో మురళి చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారు. మెరుగైన వైద్యం కోసం కావ్య శ్రీ ని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు వున్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Another tragedy in Nellore district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page