రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి

0 9,872

-రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ హామీ అమలు చేయాలి
-ప్రభుత్వ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలి
-పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలి
-ఈనెల 27 దేశ వ్యాప్త
-బందును జయప్రదం చేయాలి
-కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ లు, న్యూడెమోక్రసీ, టీజే ఎస్ పార్టీల డిమాండ్

జగిత్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

పెరిగిన నిత్యావసర, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని, ప్రభుత్వ సంస్థల అమ్మకాలను నిలిపివేయాలని తదితర డిమాండ్ల తో ఈనెల 27 న చేపట్టిన దేశ వ్యాప్త బంధును విజయవంతం చేయాలని కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం, టీజేఎస్, న్యూడెమోక్రసి పార్టీల నాయకులు వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు.
గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ కార్యాలయంలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 27న దేశ వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ, వామ పక్షాలు, టిజెఎస్ నేతలు గిరి నాగభూషణం, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, బండ శంకర్, భూతం సారంగపాణి, తిరుపతి నాయక్, ముక్రమ్, వెన్న సురేష్, భూమన్న, చింత భూమేశ్వర్, చుక్క గంగారెడ్డి,. ఇందూరి సులోచన, శారద, లత, రజిత, గోవర్ధన్, నర్సయ్య, రాజయ్య తదితరులు సమావేశo నిర్వహించారు.

 

 

 

ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ
రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలనీ,
కార్మిక 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలనీ,
విద్యుత్ బిల్లులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,
రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ హామీ అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు.
పెరిగిన పెట్రోల్, డిజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రభుత్వ సంస్థలను అమ్మాలనీ చేసే ప్రయత్నలను వెంటనే నిలిపివేయాలని, అలాగే రైల్వే,పోస్ట్ ఆఫీస్,ఎల్ఐసి,ఎయిర్ ఇండియా,ఎయిర్ లైన్స్వి,శాఖ స్టీల్ ప్లాంట్ వంటి అమ్మకాలను ఆపివేయాలని కేంద్రాన్ని నాయకులు హెచ్చరించారు.అలాగే
స్కిమ్ వర్కర్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి నాయకులు సూచించారు.

 

 

 

దేశవ్యప్త బందుకు విద్యా,వైద్య సంస్థలు , వ్యాపార సంస్థలు,రవాణా,హోటల్,విద్యావంతులు,మేధావులు,  ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాల నాయకులు బండ శంకర్ దేవేందర్ రెడ్డి,  నాగభూషణం వామపక్షాల కార్యదర్శులు సీనియర్ నాయకులు భూతం సారంగపాణి ,తిరుపతి నాయక్ ,ముఖ్రమ్ వెన్న సురేష్ ,ఆరెల్లి భూమన్న ,చింత భూమేశ్వర్, చుక్క గంగారెడ్డి ,అక్రమ్, శారద ,సులోచన, లతా, రజిత ,గోవర్ధన్ ,మొగిలి, నరసయ్య ,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Anti-farmer laws should be repealed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page