ఆన్లైన్ మోసలతో బీటెక్ విద్యార్థి సూసైడ్

0 8,821

బిటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు సూసైడ్ కి గల కారణాలు.. ఏమిటి ??
బిటెక్ విద్యార్థి సూసైడ్ వెనకాల ఆన్లైన్  జాబ్ అంటూ వేధింపులేనా..

అనంతపురం ముచ్చట్లు:

- Advertisement -

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శివారు చెరుకువాడ లో సుంకర ప్లాజాలో బీటెక్ విద్యార్థి సూసైడ్ కలకలం  రేపింది. ఫ్యాన్ కి ఉరి వేసుకొని మృతి చెందడంతో..గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లి తండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తతోలు విశ్వేశ్వరరావు 21 సం”లు( విశ్వ ) బీటెక్ విద్యార్థి. .ఆన్లైన్ లో పార్ట్ టైం జాబు విలియం టెక్ బోగస్ కంపెనీ జాబ్ లో వర్క్ చేస్తున్నాడు. విలియం టెక్ కంపనీ బ్లాక్ మెయిల్ తో..తల్లి తండ్రులకు చెప్పుకోలేక సూసైడ్ చేసుకొన్న  ఘటన చోటుచేసుకుంది.. విద్యార్థి సెల్ ఫోన్ లో విలియం టెక్ కంపనీ డబ్బు కోసం బ్లాక్ మెయిల్  చేస్తున్న చాటింగ్ బయపడింది. మీకు ఇచ్చిన పని పూర్తి చేయలేదు అంటూ..1,40,000 గంటన్నరలో చెల్లించాలంటూ బెదిరింపులు  దిగారు. లేని పక్షంలో కొర్టుకు  వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. విలియం టెక్ ఆన్లైన్ కంపనీవిశ్వ ను మనోవేదనకు గురి చేయడంతోఇంట్లో తల్లి తండ్రులకు తెలియకుండా.. అప్పటికే స్నేహితుల నుండి 4,400 రూపాయలు దఫాలుగా కంపెనీకి చెల్లించాడు. మిలిగిన మొత్తం చెల్లించాలంటూ ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొని రావడంతో భయబ్రాంతులకు గురైన విశ్వ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో .. సూసైడ్ చేసుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా అంటూ డబ్బు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వాలి అని వేడుకొన్నా కొని ఇవ్వలేదు ..నా చావు కి నా తల్లిదండ్రులు కు సంబంధం లేదు అంటూ ఫోన్ లో రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. కుమారుడు చనిపోవడంతో ఇతర విద్యార్థులు ఆన్లైన్ బోగస్ కంపెనీ లో చిక్కుకొని ..తన కొడుకుల చేసుకోవద్దు అంటూ తల్లిదండ్రులు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. పెనుగొండ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:BTech student commits suicide with online scams

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page