టీఆర్‌ఎస్వీ అధ్యక్ష పదవి కోసం పోటీ!

0 8,786

మెదక్   ముచ్చట్లు:

అధికారపార్టీలో చిన్న పదవైనా ఎంతో డిమాండ్‌ ఉంటుంది. దానికి సెంటిమెంట్‌ కూడా తోడైతే పోటీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఓ పదవి కోసం విపరీతమైన పోటీనే నెలకొంది. కాకపోతే పాత విద్యార్థి.. కొత్త విద్యార్థి అనే పేరుతో యువ నేతల మధ్య రేస్‌ మొదలుకావడంతో ఆ పదవిపై ఉత్కంఠ పెరుగుతోంది.సంస్థాగత పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది అధికారపార్టీ టీఆర్ఎస్‌. సెప్టెంబర్‌ 2 నుంచి పార్టీ నేతలంతా ఇదేపనిలో ఉన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల కూర్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. టీఆర్ఎస్‌తోపాటు.. పార్టీ అనుబంధ విభాగాలను కూడా పటిష్ఠం చేయాలనే ఆలోచనలో ఉన్నారు గులాబీ పెద్దలు. దీంతో టీఆర్‌ఎస్‌లోని అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులకు డిమాండ్‌ పెరిగింది. వీటిల్లో టీఆర్‌ఎస్వీ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ కోసం కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో చర్చగా మారింది.గతంలో టీఆర్‌ఎస్వీ ప్రెసిడెంట్లగా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బాల్క సుమన్‌లకు తర్వాతి కాలంలో కీలక పదవులు లభించాయి. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కాగా.. బాల్క సుమన్‌ ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.తాజాగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన గెల్లు శ్రీనివాస యాదవ్‌ సైతం టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేశారు.

- Advertisement -

దీంతో ఈ పదవి చేపడితే భవిష్యత్‌లో రాజకీయ పదోన్నతి ఖాయమనే సెంటిమెంట్‌ ఏర్పడింది. అలాగే పదవి చేపట్టేందుకు పోటీ పడుతున్నారు విద్యార్ధి నాయకులు.ప్రస్తుతం టీఆర్‌ఎస్వీ అధ్యక్ష పదవి విషయంలో పార్టీలో పాత, కొత్త అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాక ముందు నుంచీ పార్టీలో టీఆర్‌ఎస్వీలో పనిచేసిన వాళ్లు.. తెలంగాణ వచ్చాక పార్టీలోకి వచ్చినవాళ్ల మధ్య పోటీ నెలకొంది. పార్టీ ప్రయోజనాలు, రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవుల్లో అవకాశం కల్పిస్తూ వస్తున్నారు గులాబీ నేతలు. సమయం, సందర్భాన్ని బట్టి పదవులు, అవకాశాలు పొందుతున్నవారిలో కొత్త పాత ఉంటూ వస్తున్నారు.ప్రస్తుతం టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లు తమ సంగతేంటని అప్పుడే ప్రశ్నలు మొదలుపెట్టారట. అప్పట్లో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగంలో కన్వీనర్లుగా కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాతవాళ్లు ఛాన్స్‌ దొరక్క మదన పడ్డారు. ఇప్పుడు టీఆర్‌ఎస్వీ పదవి కూడా కొత్త వారికే ఇస్తే పాత..కొత్త వారి మధ్య సమన్వయం ఎలా అనే చర్చ జరుగుతోందట. ఈ విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉన్నా.. గులాబీ శిబిరంలో మాత్రం అన్ని పదవుల కంటే టీఆర్‌ఎస్వీ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ పైనే ఎక్కువగా ఆరా తీస్తున్నారట. మరి..ఈ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Compete for the TRSV presidency!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page