ప్రజాసంగ్రామ యాత్రలో వివాదం

0 8,807

కామారెడ్డి ముచ్చట్లు:

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర చివర్లో వివాదం నెలకొంది. కామారెడ్డి బిజెపి ఇంచార్జ్ వెంకట రమణా రెడ్డి ఇటీవల ప్రధాని మోదీపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..దీంతో పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర నేతలు అవక్కవుతున్నారు.రమణారెడ్డి ఇటీవల ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుటి అన్నదమ్ములు ,తల్లి భార్యని చూపించి మోడీ రాజకీయం చేస్తున్నారన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.బిజెపి కార్యకర్తలు తాగుబోతులు అంటూ దూషించారు.తాను బిజెపి లో చేరి తప్పుచేశానంటూఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కామారెడ్డి లో బండి సంజయ్ పాదయాత్ర జరుగుతున్న సమయం లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారతంతో గందరగోళం నెలకొంది. దీంతో పాటు ఇటీవల బిక్కునూరు మండల కేంద్రంలో గణేష్ లడ్డు వేలంపై ప్రశ్నించినందుకు పలువురు బిజెపి, కార్యకర్తల పై రమణా రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాడిని నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేసరూ సదరు యువకులు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. రమణారెడ్డి వైఖరి ముందు నుండి వివాదాస్పదంగానే ఉంది. ఉమ్మడి నిజమబద్ జిల్లా పరిషత్ ఛైర్మగా పని చేసే సమయంలో తోటి జెడ్పిటిసిలను బెదిరించిన సందర్భాలున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోటీఆరెస్ అభ్యర్థి కవిత దగ్గర  డబ్బులు తీసుకుని బిజెపి పార్టీ ప్రజాప్రతినిధులను టీఆరెస్ కి ఓటేసేలా ప్రొద్భలం చేసారని పలువురు బిజెపి స్థానిక ప్రజాప్రతినిధులు అధిష్టానానికి పిర్యాదు చేసారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది..

- Advertisement -

రమణారెడ్డి దూకుడు, అహంకార దొరనీతో ఇప్పటికే కామరెడ్డి జిల్లాలో బిజెపి పార్టీకి అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. తాజాగా బండి సంజయ్ పాదయాత్ర కూడా అయిష్టాంగానే తన నియోజక వర్గంలో పెట్టారని, సంజయ్ యాత్రతో
తనకేం లాభమని తన అనుచరుల వద్ద విమర్శలు చేసారని చర్చ కూడా నడుస్తోంది. ఇలాంటి సమయంలో వెంకట రమణా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో రిలీజ్ కావటం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇది పార్టీకి నష్టం కలిగించే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం..

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Controversy in Prajasangrama Yatra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page