ముదిరిన ఎంపీ, ఎమ్మెల్యేల వివాదం

0 8,507

రాజమండ్రిముచ్చట్లు:

రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రాం,  ఎమ్మెల్యే జక్కంపేడి రాజాల వివాదం ముదురుతోంది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి భూములిచ్చిన రైతుల మీడియా సమావేశం జరిగింది. టిడిపి ప్రభుత్వంలో రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. గతంలో మా పై కేసులు పెట్టిన సమయంలో జక్కంపూడు రాజా మాకు అండగా నిలబడ్డారు. 2013 భూసేకరణ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మొదటి నుంచి కోరుతున్నామని రైతులు అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరోసారి ఎమ్మెల్యే రాజా మా తరపున సిఎం జగన్ కు సమస్య వివరించారు. ఇప్పుడు లెక్చరర్ దీపక్ కొంత మంది రైతులను మభ్యపెట్టి 50 లక్షల పరిహారం ఇప్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు. ఆ సొమ్ములో 15 లక్షలు తనకు ఇవ్వాలని దీపక్ ఆ రైతులను అడిగారు.. దీని వెనుక ఎంపి భరత్ ఉన్నారని మా అనుమానమని రైతులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిఐడి ఇంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేసారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Controversy over senior MPs and MLAs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page