గొప్ప మనసును చాటుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

0 8,461

గణేష్ నిమజ్జనం గొడవ లో మృతి చెందిన గిరిజన యువకుడు కుటుంబానికి రెండు లక్షల నగదు అందజేత
పార్టీలకతీతంగా ప్రజలకు అండగా నిలబడే నేతగా ఎమ్మెల్యే ఆళ్ల పై ప్రజల ప్రశంసల జల్లులు

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

- Advertisement -

అపర దాన కర్ణుడు మరియు పేదల పాలిట పెన్నిధి,బడుగు బలహీన వర్గాలు, అణగారిన దళిత గిరిజన ఆశాజ్యోతి గా ప్రజా నాయకుడిగా వర్ధిల్లుతున్న మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును సాటి ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ కొండంత ధైర్యం కల్పించారు. గణేష్ నిమజ్జనం గొడవల్లో మృతి చెందిన గిరిజన యువకుడి కుటుంబానికి ఆయన అండగా నిలబడ్డారు. మృతి చెందిన యువకుడు కుటుంబానికి రెండు లక్షల రూపాయల నగదును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తన చేతుల మీదుగా అందజేసి తన గొప్ప గుణాన్ని మరోసారి చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారు ఏ పార్టీ వారైనా తనకు సమానమేనని వారిని ఆదుకోవడం శాసనసభ్యుడిగా తన కర్తవ్యమని పలు వేదికల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చెబుతుంటారు. తాను చెప్పే ప్రతి మాటకు కట్టుబడి నిలబడే వ్యక్తిగా గొప్ప పేరున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పార్టీల విభేదాలు చూడకుండా యువకుడి కుటుంబాన్ని నేరుగా కలిసి 2 లక్షల రూపాయల నగదును అందించడమే కాకుండా భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తను కలవాలని మృతి చెందిన యువకుడు తల్లిదండ్రులలో ఆయన ధైర్యాన్ని నింపారు. భూత్పూర్ మండల్ కొత్త మొల్గర గ్రామంలో కొన్ని రోజుల క్రితం మరణించిన  మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇక ఆ కుటుంబం బాధ్యత తాను చూసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. మహేష్ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల నగదు ఆర్థిక సహాయం చేసిన  దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భవిష్యత్తులో కూడా తన వంతు సహకారం ఉంటుందని ఆయన వారి లో కొండంత భరోసాను నింపారు. మహేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున వచ్చే సహాయాన్ని ప్రభుత్వంతో మాట్లాడి  ఆ కుటుంబానికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం తరపున  అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కక్ష్యపూరిత రాజకీయాలు ఉండొద్దని ఒక ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే  రాజకీయం చేయాలని, మిగతా సమయంలో ప్రజలకు సేవ చేయడం పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  పిలుపునిచ్చారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Devarakadra MLA Ala Venkateshwar Reddy expressed his great mind

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page