కర్నూలు వైసీపీలో ఇంటి పోరు

0 8,503

కర్నూలు ముచ్చట్లు:

నెత్తి మీద గుడ్డ.. కళ తప్పిన ముఖం.. కంటి నిండా కన్నీరు.. ఈ సీన్‌ చూస్తే ఎవరికైనా వారి కుటుంబంలోనో లేదా బంధువుల్లోనో ఏదో అశుభం జరిగిందని అంతా భావిస్తాం.. ఇదే తరహాలో అయ్యో పాపం అని ఓదార్చేలా కనిపిస్తోన్నాయి ఇప్పుడు ఏపీలో సీన్స్. అయితే, దీని వెనక స్టోరీ వేరే ఉంది. వాళ్ల రోధనంతా అశుభం జరిగినందుకు కాదు.. తనకు పదవి కావాలని, అది కూడా మండల స్థాయిలో ఉండే ఏంపీపీ పదవి కోసం. కట్ చేస్తే..అఖండ మెజార్టీతో గెలిచిన వైసీపీ పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇలా రోదిస్తూ కనిపిస్తున్నారు. దానికి కారణం.. వారికి ఎంపీపీ పదవి కావాలని.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విషయంలో అంతగా విభేదాలు కనిపించలేదు. కానీ ఎంపీపీ పదవి కోసం మాత్రం ఆశావహులు ఏడ్చే వరకు వెళ్లింది పరిస్థితి. ఇలాంటి సీన్‌ కర్నూలు జిల్లా కోడుమూరు నిమోజకవర్గంలో కనిపించింది.లోతుల్లోకి వెళ్తే, కోడుమూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ సమన్వయకర్త కోట్ల హర్షవర్థన్ రెడ్డి మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. గూడూరు ఎంపీపీ పదవి తన తల్లికి వస్తుందని వైసీపీ నేత నరసింహారెడ్డి ఆశించారు. గూడూరు మండలంలోని కే నాగలాపురం నుంచి ఎంపీటీసీగా నరసింహారెడ్డి తల్లి రాజమ్మ గెలుపొందింది. ఇక గూడూరు ఎంపీపీ తల్లి రాజమ్మకు ఖాయం అనుకుంటున్న సమయంలో గత ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన చనుగొండ్ల కు చెందిన ప్రతాప్ రెడ్డి తన భార్యకు ఎంపీపీ పదవి ఇప్పించుకునేందుకు చక్రం తిప్పారు.ఇంతకాలం కష్టపడితే పదవి వస్తుందనుకున్న సమయంలో వేరే వాళ్ళు తన్నుకపోవడం పట్ల నరసింహారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. దుఃఖం పట్టలేక బోరున విలపించారు. తన తల్లి గ్రామ కార్యకర్తలతో కలిసి నాగలాపురం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు… కష్టపడిన కార్యకర్తలకు సీఎం జగన్ న్యాయం చేయాలని బోరున విలపించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Home fight in Kurnool YCP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page