కొప్పర్రు లో హోంమంత్రి పర్యటన

0 8,758

గుంటూరు ముచ్చట్లు:

ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామంలో గాయపడిన వైస్సార్సీపీ నాయకులను  హోంమంత్రి సుచరిత పరామర్శించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు లో టీడీపీ నాయకులపై దాడి అని అవాస్తవాలను ప్రచారం చేశారు. రాళ్లు, కర్రలు, కారం తో టీడీపీ కార్యకర్తలు వైస్సార్సీపీ వాళ్లపై దాడి చేసారు. టీడీపీ వాళ్ళ దాడిలో దాదాపు పది మంది వైస్సార్సీపీ నాయకులకు తీవ్ర గాయాలు అయ్యాయి.  వినాయక నిమజ్జనం చేసి వస్తున్న వైస్సార్సీపీ నాయకులతో కావాలనే టీడీపీ వాళ్ళు గొడవకు దిగారు. దాదాపు 40 మంది టీడీపీ వాళ్ళు వైస్సార్సీపీ వాళ్లపై కర్రలతో దాడి చేశారు. టీడీపీ వాళ్ల దాడిలో వైస్సార్సీపీ నాయకుడు ఇంటూరి హనుమంతరావు కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రశ్నించడానికి వెళ్లిన హనుమంతరావు కుమారుడు ఇంటూరి శ్రీకాంత్ ను టీడీపీ ఎక్స్ జడ్పీటీసీ ఇంట్లోకి లాక్కెళ్లి చితకొట్టారు.  శ్రీకాంత్ ను రక్షించడానికి వెళ్లిన వైస్సార్సీపీ నాయకులపై మరోసారి రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ నాయకుడి ఇంట్లోని ఒక సోఫా తగలబడటం జరిగింది.  గాయాలపాలయిన వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను స్థానిక పోలీసులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. దాడి చేసిన టీడీపీ వాళ్ళే తిరిగి వైస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టారు. టీడీపీ నాయకులపై దాడి, ఇంటిని ధ్వంసం చేసారు అని టీడీపీ వాళ్లే మీడియాలో అసత్య ప్రచారాన్ని ప్రచారం చేయించారు.  వాస్తవ విషయాలు సమాజానికి, మీడియా కు తెలియాలనే నేను కొప్పర్రు గ్రామానికి రావడం జరిగింది. ప్రశాంతమైన కొప్పర్రు గ్రామంలో కావాలనే టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. కొప్పర్రు లో దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత పోలీసులకు సూచించారు.  మీడియా ప్రతినిధులు కూడా వాస్తవాలను ప్రసారం చేయాలని హోంమంత్రి సుచరిత  కోరారు. భవిష్యత్తులో కొప్పర్రు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా వుండాలని హోంమంత్రి విజ్ఞప్తిచేశారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Home Minister’s visit to Kopparru

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page