పుంగనూరులో ఉర్లగడ్డ, టమోటాలో తెగుళ్ల నివారణకు చర్యలు

0 24

పుంగనూరు ముచ్చట్లు:

 

ఉర్లగడ్డ, టమోటా పంటలలో తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాఘవేంద్రరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మండలంలోని మాగాండ్లపల్లె, బైరేమంగళం గ్రామాల్లో హెచ్‌వో లక్ష్మిప్రసన్న, పద్మజ లతో కలసి బంగాళదుంప, టమోటా, జామ, బొప్పాయి పంటలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలకు చీడ, పీడల నివారణ కొరకు రైతులు తగిన మోతాదులో మందులు వినియోగించుకోవాలన్నారు. ఉర్లగడ్డలో నత్తనివారణకు మెటాల్‌డిహైడ్‌ రెండుకిలోలు ఎకరంలో వేయాలన్నారు.అలాగే మెటాల్‌డిహైడ్‌ను పిచికారి రూపంలో దశల వారిగా వినియోగించుకోవాలని సూచించారు. టమోటా పంటల్లో బ్యాక్టిరియా మచ్చతెగులు, గజ్జినివారణ తెగుళు నివారణకు కాపర్‌ఆక్సిక్లోరైడ్‌ను లీటరుకు మూడు గ్రాముల చొప్పున నీటిలో కలిపి , ఇందులో ప్లాంటామైసిన్‌ రెండు గ్రాములను కలిపి టమోటాలపై పిచికారి చేయాలన్నారు. దీని ద్వారా తెగుళ్లు నివారించేందుకు వీలుందన్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనల కోసం ఆర్‌బికెలలో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags; Measures for control of pests in potato and tomato in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page