వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టులో కొత్త ట్విస్ట్

0 7,858

హైదరాబాద్  ముచ్చట్లు:

జూబ్లీహిల్స్‌ వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులోని మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. యువతి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు యజమాని చైతన్య, హౌస్‌కీపర్ బెనర్జీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబర్‌ 10లోని వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్ కోర్టు ఉంది. ఇందులో ఓ యువతి హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. బుధవారం సాయంత్రం బాత్‌రూంలోకి వెళ్లగా కిటికీ వద్ద ఓ సెల్‌ఫోన్‌ చూసింది. ఈ విషయాన్ని వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు పరిశీలించగా సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఉన్నట్టు గుర్తించారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్ కెమెరా బుధవారం ఉదయం నుంచి ఆన్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టగా బాత్‌రూమ్‌ క్లీనర్‌ బెనర్జీ ఫోన్‌ను బాత్‌రూమ్‌లో అమర్చినట్లు తేలింది.ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చైతన్య, బెనర్జీ నివాసాల్లో సోదాలు చేశారు. బెనర్జీ అమర్చిన సీక్రెట్ ఫోన్లో 5 గంటల డేటా ఉందని, సుమారు 20 మంది యువతులు నగ్న దృశ్యాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే ఇటీవల ఆ హోటల్‌కు వెళ్లిన పలువురు మహిళలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలివస్తున్నారు. తమకు సంబంధించిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు.సంచలనం రేపిన ఈ ఘటనపై వన్ డ్రైవ్ ఇన్ హోటల్ యజమాని చైతన్య స్పందించారు. తమ హోటల్ బాత్‌రూమ్‌లో కెమెరా పెట్టింది హౌస్‌కీపిండ్ బాయ్ బెనర్జీయేనని తెలిపారు. ఈ ఘటనలో హోటల్ యాజమాన్యంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. బాత్‌రూమ్‌లో ఆరు నెలలుగా ఫోన్ అమర్చినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, అతడు ఫోన్ కొని నాలుగు రోజులే అవుతోందని పేర్కొన్నారు. బాత్‌రూమ్‌లో ఫోన్ పెట్టిన రోజే యువతి గుర్తించి తమకు ఫిర్యాదు చేసిందని, దీంతో తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని చైతన్యం తెలిపారు. తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఈ విషయంలో కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:New twist on the One Drive food court

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page