మావోయిస్టు సామాగ్రి స్వాధీనం

0 8,509

విశాఖపట్నం  ముచ్చట్లు:

ఏవోబీలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులు సంఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన భారీ సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏవోబీలోని మల్కన్గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్న ఎస్వోజీ, డీవీఎఫ్ బలగాలకు మావోయిస్టులకు తారసపడ్డారు. ఈ సందర్బంగా మావోయిస్టులకు పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు అనంతరం  సంఘటనస్థలం నుంచి గాలించగా భారీ ఎత్తున మందుగుండు సామాగ్రీ, విప్లవ సాహిత్యం, గొడుగులు, థర్మల్ ఫ్లాస్క్, తదితర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అభిషేక్ మినా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు హింసను విడనాడి, జనజీవనస్రవంతిలో కలవాలనీ, లొంగిపోయిన వారికి పునరవాసం కల్పిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Seizure of Maoist supplies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page