సిటీలో టు లెట్ బోర్డులు

0 88,680

హైద్రాబాద్  ముచ్చట్లు:

లాక్ డౌన్ తో చాలా మంది సొంతూళ్లకు షిఫ్ట్ అవ్వడంతో సిటీలో టు లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన ప్రాంతాల్లోకి మారుతున్నారు ఎంప్లాయీస్. ఆఫీసులకు దగ్గరగా ఉన్న ఏరియాల్లో పోర్షన్లు ఈజీగా దొరుకుతున్నా…షిప్టింగే కష్టంగా మారిందంటున్నారు. సామాన్లు తరలించేందుకు లేబర్, ట్రాన్స్ పోర్ట్ లేక అవస్థలు పడుతున్నానమని చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో షిఫ్టింగులు చేస్తున్న ఇళ్లే చాలా వరకు కనిపిస్తున్నాయి.సిటీలో ఇళ్లను షిఫ్ట్ చేసే ప్యాకర్స్ సంస్థలు 50కి పైగానే ఉన్నాయి. సింగిల్ బెడ్ రూమ్ నుంచి విల్లాల షిఫ్టింగ్ వరకు అవి సేవలందిస్తున్నాయి. వెహికిల్, లేబర్, ప్యాకింగ్, షిఫ్టింగ్ వరకు అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ ని బట్టి..చార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ కరోనా సీజన్ కావడంతో రేట్లు విపరీతంగా పెంచారంటున్నారు జనం. బయట నుంచి ట్రాలీ లేదా డీసీఎం మాట్లాడుకుందామంటే డబుల్ రేట్లు చెబుతున్నారంటూ వాపోతున్నారు.

- Advertisement -

మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో కొన్ని నెలలుగా ఇళ్ళు ఖాళీగా ఉండటంతో ఓనర్లకు కూడా కష్టాలు తప్పడం లేదు.కరోనా భయంతో మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కూకట్ పల్లి, బంజారాహిల్స్ లాంటి ఏరియాల్లో కొత్త వారిని తమ అపార్ట్ మెంట్లలోకి రానివ్వడం లేదు జనం. కొత్త ఇంటికి మారాలన్నా…కొన్ని వెల్ఫేర్ సొసైటీలు ఒప్పుకోవడం లేదు. ఇళ్లు ఖాళీ చేయాలంటే…అపార్ట్ మెంట్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు లేబర్ రావడానికి మరో రెండు రోజులు పడుతోందని అంటున్నారు మరికొందరు. మరికొన్ని చోట్ల కొత్తవారికి రెంట్ కు ఒప్పుకోవట్లేదనీ…. వచ్చే రెంట్ పోతుందని ఇళ్ళు ఖాళీ చేయనివ్వడం లేదంటున్నారు.ప్యాకర్స్ సంస్ధల్లో పనిచేసే లేబర్స్..చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ. లాక్ డౌన్ తో వారు… సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో లోకల్ గా దొరికే కొద్ది మందితోనే సేవలందిస్తున్నట్టు చెబుతున్నారు నిర్వాహకులు. గతంలో 15 మందితో పనిచేసే తాము…ఇప్పుడు ఇధ్దరు ముగ్గురితో సర్థుకుంటున్నామంటున్నారు. వెహికిల్స్ , ప్యాకింగ్, లేబర్ కి అదనంగా ఇవ్వాల్సి రావడంతో రేట్లు పెంచక తప్పలేదంటున్నారు. కరోనా పేరుతో దోచుకుంటున్న వారిపై  ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు జనం. ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలు కట్టడి చేయాలని కోరుతున్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:To Let Boards in the City

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page