బిటి కాలేజీని అభివృద్ది చేస్తాం-ఎంపీ మిథున్ రెడ్డి

0 9,880

మదనపల్లె ముచ్చట్లు:

 

మదనపల్లె బిటి కళాశాలను తప్పని సరిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మరిన్ని కొత్త కోర్సులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలేజీగా మారుస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు. నేడు మదనపల్లెబిసెంట్ దివ్యజ్ఞాన కళాశాల విద్యార్థులు ప్రదర్శనగా ఎంపిడిఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే నవాజ్ భాషా ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాయలసీమకేతలమానికం అయిన బిటి కళాశాలను ప్రభుత్వపరం చేసే ప్రయత్నం జరుగుతోందని, విద్యార్థులు ఎవ్వరూ అధైర పడవద్దన్నారు. కళాశాల పేరు మార్పు చేయకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించడం
జరుగుతుందన్నారు. అదే విధంగానే మరిన్ని కోర్సులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలేజీగా మారుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: We will develop BT College-MP Mithun Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page