30 నెలలు…70  నియోజకవర్గాలు

0 8,890

విజయవాడ ముచ్చట్లు:

ఇక ముప్పయి నెలలే సమయం. ఒక రకంగా ఎన్నికలు ముంచుకొస్తున్నట్లే. అందుకే చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఎప్పుడైనా అధికార పార్టీకన్నా విపక్షానికే ఎన్నికలు సవాల్ అని చెప్పక తప్పదు. అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఆర్థిక వనరులతో పాటు క్యాడర్ లో జోష్ నింపడం, ఓటు బ్యాంకును పెంచుకోవడం విపక్ష నేత ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం చంద్రబాబు అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది.రాజకీయాల్లో కాలం ఇట్టే గడిచిపోతుంది. రోజులు సెకన్లలా వారికి దొర్లిపోయినట్లు కన్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తుంది. అంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ముప్ఫయి నెలలే అని చెప్పుకోవాలి. ముప్ఫయి నెలలు అంటే విపక్షాలకు స్వల్ప సమయమే అని చెప్పాలి. అందులోనూ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి చూడటంతో ఈ ముప్ఫయి నెలలు చంద్రబాబు శ్రమించి తీరాల్సిందే.అందుకోసమే చంద్రబాబు వరసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమానికి పార్టీ శ్రేణులకు ఇస్తున్నారు. తాము అప్పజెప్పిన కార్కక్రమం ఎక్కడ ఎలా జరిగింది అన్న దానిని స్వయంగా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. నేతలు డల్ గా ఉన్నారని గుర్తించన చోట ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తన సొంత జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనాలంటే ఏం చేయాలన్న దానిపై స్థానిక నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కావడం ఇందుకు ఉదాహరణ.మొత్తం 175 నియోజకవర్గాల్లో దాదాపు యాభై నియోజకవర్గాల్లో నేతలు డల్ గా ఉన్నట్లు చంద్రబాబు గుర్తించారు. ఇన్నాళ్లు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడి తాము బయటకు రావడంలేదని వారు చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ ఇకపై అలా ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపుతున్నారు. ఇన్ ఛార్జిగా ఉండటం ఇష్టం లేకుంటే ఇప్పుడే చెప్పండి వేరే వారికి బాధ్యతలను అప్పగిస్తానని చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. దీంతో నేతలు కూడా తమకు టిక్కెట్ గండం పొంచి ఉందని వీధుల్లోకి వస్తున్నారు. చంద్రబాబుకు ముప్ఫయి నెలలు సమయం మాత్రమే ఉండటంతో దూకుడు పెంచారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:30 months … 70 constituencies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page