66 ఎంపీటీసీ ఐదు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసిపి

0 8,764

ఆనందంలో నాయకులు..
* కార్యకర్తలతో ఘనంగా ప్రమాణస్వీకారం, భారీగా ఊరేగింపులు

పత్తికొండ ముచ్చట్లు:

- Advertisement -

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో వై సీ పీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో 78 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 66 స్థానాలను వైసిపి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తొమ్మిది టిడిపి సొంతం చేసుకోగా ఒకటి సిపిఐ మద్దతుదారులు గెలుపొందారు. కోరం లేక రెండు స్థానాలు వాయిదా పడ్డాయి. శుక్రవారం పత్తికొండ మండల పరిషత్ ఎంపీపీగా నారాయణ దాసు, వైస్ ఎంపీపీ గా కొత్తపల్లి బలరాముడు, కో ఆప్షన్ మెంబర్ గా కారుమంచి నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. మద్దికెర మండలంలో ఎంపీపీగా అనిత, వైస్ ఎంపీపీ గా మహేష్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ గా పెద్ద మస్తాన్, క్రిష్ణగిరి మండల పరిషత్ ఎంపీపీ గా డాక్టర్ కంగాటి వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బోయ సుశీల, కో ఆప్షన్ మెంబర్ గా షాలు సాహెబ్, వెల్దుర్తి మండల పరిషత్ ఎంపీపీ గా బొమ్మన సరళ రెడ్డి, వైస్ ఎంపీపీ గా మిద్దె రంగయ్య , కో ఆప్షన్ నెంబర్ గా మాలిక్ భాష, తుగ్గలి మండలం పరిషత్ ఎంపీపీ ఆదెమ్మ , వైస్ ఎంపీపీ ఎద్దుల దొడ్డి మల్లికార్జున్ రెడ్డి , కో ఆప్షన్ మెంబర్ రాతన చాంద్ భాషాలు నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆనందోత్సవాల మధ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ వ్యవస్థాపకుడు పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అర్హత కలిగిన పేద ప్రజలకు దరి చేర్చడానికి  అందరూ కృషి చేయాలన్నారు. తన-మన అన్న తేడా లేకుండా పేదలను ఆర్థిక, సామాజిక, రంగాల్లో రాణించడానికి తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థల పాలకులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం చేస్తున్న కృషిలో భాగంగా అందరూ సహకారం అందించాలన్నారు. ఈ విజయం ప్రజల విజయమన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సేవలకు పేదలు అండగా నిలిచారని నిరూపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారథి అడ్వకేట్ ఎల్లారెడ్డి, వై సీ పీ నాయకులూ గోవిందు, వెంకటేశ్వర్లు, అనిత, బాబుల్ రెడ్డి ,కోటేశ్వర రావు, గణపతి, సాబ్దిన్ నజీర్ పాల్గొన్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:66 MPTC is the YCP that has bagged five MPP seats

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page