అసైన్డ్ భూముల‌పై గురి

0 8,795

న‌ల్గొండ‌ ముచ్చట్లు:

నిరుపేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను పరిశ్రమల పేరిట ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాను పరిశ్రమల హబ్గా మారుస్తామని ప్రకటించిన సర్కారు ఎప్పుడో 50, 60 ఏండ్ల కింద పేదలకు పంపిణీ చేసిన భూములతోపాటు, పట్టాదారు రైతుల నుంచి వేల ఎకరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ దాదాపు 1,528 ఎకరాలు గుర్తించింది. పలుచోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయగా, మిగిలిన ప్రాంతాల్లో భూముల స్వాధీనానికి ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. కాగా, నల్గొండ జిల్లాలో హైదరాబాద్-–విజయవాడ నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న గ్రామాల్లో చేపట్టిన భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పేరుతో నిరుపేద రైతులు, దళితులకు దశాబ్దాల క్రితం పంపిణీ చేసిన అసైన్డ్ ల్యాండ్స్, పట్టా భూములపై ప్రభుత్వం కన్నేసింది. ప్రధానంగా హైదరాబాద్-–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చౌటుప్పుల్, చిట్యాల, సూర్యాపేట, చివ్వెంల మండల్లాలో భూములు సేకరించే పనిలో పడింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే పలురకాల ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు వెదజల్లే హానికారక కెమికల్స్ తో  ఇప్పటికే సాగు, తాగునీరు కలుషితమై పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా కాలుష్య రహిత కంపెనీల పేరుతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, ఫర్నిచర్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడంతోపాటు, హైదరాబాద్ చర్లపల్లి సమీపంలోని దాదాపు 450 కాలుష్యరహిత కంపెనీలను నల్గొండ జిల్లాకు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.పరిశ్రమల వల్ల వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాటికి అవసరమయ్యే భూములను పేదల నుంచి లాక్కోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని వేల ఎకరాల్లో భూములు ఉండగా, అసైన్డ్ భూములపై ప్రభుత్వం కన్నేయడం విమర్శలకు దారితీస్తోంది. చిట్యాల మండలం వెలిమినేడులో గ్రీన్ ఇండస్ట్రి యల్ పార్కు  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం  62 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల మీదనే దాదాపు 150 మంది దళిత, పేద రైతుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇవిగాక మరొక 161 ఎకరాలు పట్టా భూముల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూముల సేకరణ నిలుపుదల చేయాలని, పార్కు ఏర్పాటు చేయొద్దని వెలిమినేడు గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసింది. అదేవిధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు.నేషనల్ హైవేకు ఇరువైపులా వేల ఎకరాల్లో పెద్దల భూములు ఉండగా, పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలిమినేడు రైతులు చెబుతున్నదాని ప్రకారం  డేరా బాబాకు చెందిన 57 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. రాంకీ సంస్థకు చెందిన సుమారు 200 ఎకరాల భూమి వెలిమినేడు పంచాయతీ పరిధిలోనే ఉంది. దీంతోపాటు వివిధ రకాల సర్వే నంబర్లలో ఎవరికీ పట్టాలు ఇవ్వని ప్రభుత్వ భూమి సుమారు 170 ఎకరాల వరకు ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. వాటిని కాకుండా తమ భూములనే తీసుకోవడం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. హైవే వెంట సాగుకు పనికిరాని భూమి కూడా ఎకరాకు రూ .40 లక్షల వరకు పలుకుతోందని, అలాంటిది తమ భూములకు మాత్రం ఎకరాకు ఐదారు లక్షల పరిహారం చెల్లించాలనుకోవడాన్ని తప్పు పడుతున్నారు. తమకు అన్యాయం చేస్తే తెగించి పోరాడుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Aim on assigned lands

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page