బోయకొండలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన కు ఏర్పాట్లు

0 9,295

– ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు
– ఏర్పాట్లపై పరిశీలించిన రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
-కొత్తపనుల మంజూరుపై ప్రతిపాధనలు సిద్దంచేయాలని సూచన

 

చౌడే పల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ లో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను పురస్కరించుకొని శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్‌రెడ్డిల సహకారంతో కోట్లాది రుపాయలతో వివిధ అభివృద్దిపనులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పనులు పూర్తి కావడంతో , మరిన్ని అవసరమైన పనులకు శంఖుస్థాపనులు, ప్రారంభోత్సవాలు, చేయనున్నారు. అమ్మవారికి కుటుంబసమేతంగా పట్టువలను సైతం సమర్పించనున్నారు. మంత్రి పర్యటన లో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి, పాలక మండళి సభ్యులు రమేష్‌రెడ్డి లతో కలిసి బోయకొండ ఆలయాన్ని సందర్శించారు. ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగ సభను ఏర్పాటుచేసే స్థలంను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్దిపనులతో పాటు , ఇంకనూ అవసరమైన పనులను గుర్తించి వాటి మంజూరుకు ప్రతిపాధనలు సిద్దంచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సోమల మల్లికార్జునరెడ్డి,నవీన్‌రెడ్డి, తదితరులున్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Arrangements for Minister Peddireddy’s visit to Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page