ధరణి అక్రమాలను అరికట్టాలి

0 8,795

సిరిసిల్ల ముచ్చట్లు:

రైతు  రుణ  మాఫీ , రాష్ట్రంలో  రైతులు  ఎదుర్కొంటున్న సమస్యలు  పై  ముఖ్యమంత్రి  కెసిఆర్   కు  అయిదు పేజీల   బహిరంగ   లేఖ  బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షుడు    బండి  సంజయ్  కుమార్  రాసారు.   2018 ఎన్నికల  సందర్భంగా   తెరాస  పార్టీ   ఇచ్చిన  లక్ష  రూపాయల  రైతు  రుణ  మాఫీని  వెంటనే  అమలు  చెయ్యాలని  డిమాండ్  చేసారు. రైతు రుణ  మాఫీ  క్రింద  ఇవ్వాలిసిన  27 వేల  500 కోట్ల  రూపాయల  నిధులను  డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి  కెసిఆర్  వరి  పంట  వేయొద్దని  ఇచ్చిన  ప్రకటనను   ఉపసంహరించుకోవాలి. ప్రధాన  మంత్రి  ఫసల్  భీమా  పధకం  క్రింద  రాష్ట్ర   ప్రభుత్వం  తమ   వాటా  సొమ్ము  413. 50 కోట్ల  రూపాయలను  చెల్లించి  రైతులను  ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో  జరుగుతున్న  రైతుల  ఆత్మ  హత్యలు  అన్ని   తెరాస  ప్రభుత్వ  హత్యలే. రైతులకు  ఉచితంగా  ఎరువులు  ఇచ్చి  2018 ఎన్నికలు  సందర్భంగా  తెరాస  ఇచ్చిన  హామీని  నిలుపుకోవాలి. మొక్కజొన్న  కొనుగోలు  కేంద్రాలు  వెంటనే  ప్రారంభించి , రైతులను  దళారీలనుండి  రక్షించాలి. ధరణిలో  జరుగుతున్న  అక్రమాలను  అరికట్టాలి. రైతులకు  పట్టాదార్  పాసుబుక్కులను  వెంటనే  మంజూరి  చెయ్యాలి. రైతులకు  అండగా   ఉండి  వారి  తరఫున  బీజేపీ  తెలంగాణ  శాఖ  పోరాటం  చేస్తుందని అయన అన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Dharani must prevent irregularities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page