గోవింద నామస్మరణతో మార్మోగిన హోసూరు గ్రామం

0 8,468

పత్తికొండ ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి పత్తికొండ మండలం, హోసూరు గ్రామంలోని, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం నందు జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన కస్తూరి ప్రసాద్ ధార్మిక ప్రవచనాలు, వీరభద్రస్వామి భజన బృందం చేసిన భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముగింపు రోజున గోపూజ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సనాతన భారతీయ ధర్మంలో గోవుకు మాతృస్థానం ఇవ్వబడిందని దానికి కారణం గోవు ఆబాలగోపాలాన్ని తల్లిలా పోషించే గుణమున్నదని, అటువంటి గోసంపదను పోషించుటకే తిరుమల తిరుపతి దేవస్థానములు గుడికో గోమాత పథకాన్ని ప్రవేశపెట్టిందని, గోరక్షణ వ్యక్తి ధర్మమే కాదు, సమాజ ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త హనుమన్న, హార్మోనిష్టు యజ్ఞం రామాంజనేయులు,తబలిష్టు విజయకుమార్, శ్రీ వీరభద్రస్వామి భజన మండలి అధ్యక్షులు బోయ హనుమంతు, దేవర వన్నూరప్ప,బనగాని వన్నూరప్ప,చాకలి పరశురాముడు, తెలుగు పండితులు నేటూరు వెంకటేశ్వర్లు యాదవ్ , కావేరి గోపాల్, బైరపు పరశురాముడు మాజీ సర్పంచ్ బైరపు వీరభద్రుడు, పుల్లూరి కృష్ణ మూర్తి,బండమీద జయరాములు, పత్తికొండ రామాంజనేయులు,ఉలివేని శేఖర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Hosur is a village named after Govinda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page