నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

0 5,733

జగిత్యాల ముచ్చట్లు:

జిల్లా కేంద్రంలోని సువర్ణ దుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరపత్రాలను ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ బ్రహాండభేరి నరేష్, కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్ ల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిత్యం అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై 15వ తేదీన విజయదశమి వరకు ఉత్సవాలు ముగుస్తుందని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ తప్పనిసరి మాస్క్ , సానిటైజ్ చేసుకోవాలని సూచించారు., సువర్ణ దుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు బొద్దున రాంగోపాల్, కటుకం శశాంక్, త్రిలోక్, వెంకటేష్, విక్రమ్, తాటిపాముల వినోద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Launch of Navratri Festival Brochures

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page