పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

0 8,798

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల పట్టణానికి చెందిన గోపాడి నరేందర్ రావు కు శుక్రవారంనాడు తన ఇంటి పరిసరాల్లో ఒక సెల్ ఫోన్ లభించడంతో దాన్ని తిరిగి భాదితునికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. పట్టణానికి చెందిన నరేందర్ రావు ఉదయం పూట ఇంటి పరిసరాల్లో ఒక మొబైల్ ఉన్నట్లు గుర్తించాడు. అది ఎవరిదో అని తన కుటుంబ సభ్యులను ఆరా తీశాడు.అయితే మనది కాదు అని చెప్పడంతో పోగొట్టుకున్న బాధితుని వివరాలు సేకరించి విషయంలో అందులో ఉన్న కొందరు సెల్ నంబర్లు సేకరించి వాటికి కాల్ చేయడంతో బెంగుళూరు బేకరీ గురు అనే వ్యక్తికి సంబంధించినదిగా తెలియపరిచారు. పొరుగునే ఉండే ఆ వ్యక్తి కి ఫోన్ చేసి తన వద్ద పోగొట్టుకున్న ఫోన్ ఉందని చెప్పడంతో వెంటనే ఆ వ్యక్తి నరేందర్ రావు ఇంటికి వచ్చి సెల్ ఫోన్ తీసుకున్నాడు.
కాగా నరేందర్ రావు తన నిజాయితీని చాటుకోవడం పట్ల గురు కృతజ్ఞతలు తెలిపారు. పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ తిరిగి బాధితునికి అప్పగించినట్లు తెలుసుకున్న అతని మిత్రులు నరేందర్ రావు ను అభినందించారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Lost cell phone handover

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page