వెబ్ సైట్ లో ఇబ్బందులు

0 9,263

తిరుమల ముచ్చట్లు:

 

టీటీడీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల కావాల్సిన 300 రూపాయల దర్శన టికెట్లు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు నిరాశకు గురవుతున్నారు.అంతకుముందు ఈ ఉదయం 9 గంటలకు 300 రూపాయల టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. దీంతో వేలాది మంది భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా టికెట్లను విడుదల చేయలేకపోతున్నామని టీటీడీ అధికారులు ప్రకటించారు. టికెట్ల బుకింగ్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వెబ్‌సైట్ లో తెలిపింది టీటీడీ.ఫలితంగా దేవదేవుడు తిరుమల శ్రీనివాసుని అక్టోబర్ నెలలో దర్శించుకోవాలని భావించిన భక్తులకు నిరాశ ఎదురవుతోంది. భక్తులు ఆన్ లైన్ బుకింగ్ సాధ్యం కాకపోవడంతో ఎదురు చూపులు చూస్తున్నారు. అంతకు ముందు టైం స్లాట్ ప్రకారం భక్తులు గోవింద యాప్ లోనే కాక టీటీడీ వెబ్ సైట్ లో కుడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు, రేపటినుంచి రోజుకు 8 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ ఉండాలి లేదా మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ పేర్కోంది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Problems with the website

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page