విషజ్వరాల పై అవగాహన కల్పించిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ

0 8,487

మందమర్రి ముచ్చట్లు:

మందమర్రి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వర్షాకాలంలో విజృంభిస్తున్న విషజ్వరాలు పై వాటినిఅరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును శుక్రవారం భాగ్యనగర్ కాలనీ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం అతలాకుతలం అయ్యిందని దానికి తోడు వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా లాంటి విషజ్వరాలు వచ్చి రక్త కణాలు పడిపోవడం జరుగుతుందని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అని పక్క పరిసరప్రాంతాలు నీరు నిలువకుండా చూసుకోవాలని బ్లీచింగ్ పౌడర్ వల్ల దోమలు ఈగలు వచ్చే అవకాశం ఉండదని వారు తెలిపారు. ఇంటిలోని తడి పొడి చెత్తను చెత్త సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి అందివ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ అజీమొద్దిన్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, కవి రాజు, నాగరాజు, శ్రీకాంత్, రాజు, చింటూ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Public Service Welfare Society raising awareness on toxins

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page