టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ పనితీరును పరిశీలించిన -టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ,అదనపు ఈవో ధర్మారెడ్డి

0 26

-టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ పనితీరు మెరుగుపరచడం కొరకు తీసుకున్న చర్యలు ఫలించాయి.

తిరుమల ముచ్చట్లు:

- Advertisement -

గడిచిన రెండు మూడు నెలలుగా కోవిద్ కారణంగా విడుదల చేసిన టిక్కెట్లు పరిమిత సంఖ్యలో ఉండడం వలన చాలామంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి లక్షలాదిగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడం కారణంగా టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడం జరిగింది.దీనిని అతిక్రమించడం కోసం ఉన్న అతి తక్కువ సమయంలో (20 రోజులు) వివిధ మార్గాలను అన్వేషించి సాంకేతిక నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుని AWS వంటి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఆ సమయంలో జియో యాజమాన్యం వారు తిరుమల శ్రీవారికి సేవ లాగ భావించి అన్నీ తామై సుమారు 2, 3 కోట్ల రూపాయల విలువ చేసే సర్వీస్ ను ఉచితంగా అందించడం జరిగింది.ఈ రోజు అనగా 24వ తేదీ తొమ్మిది గంటలకి తొలిసారిగా జియో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన సమయంలో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే తగు చర్యలు చేపట్టి పరిష్కరించారు. సుమారు గంట సమయంలోనే 200000 టికెట్లు బుక్ చేసుకోగలిగారు.

తక్కువ సమయం ఉండటం కారణంగా తిరుపతి బాలాజీ పేరుతో సబ్ డొమైన్ తీసుకు రావడం కుదరదు కనుక జియో వారి సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ వాడుకుని టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ ని ల్యాండింగ్ పేజీ గా వాడుకుని జియో మార్ట్ సబ్ డొమైన్ కి రూట్ చేయడం జరిగింది.తదుపరి టికెట్ల విడుదల సమయంలో ఈ సబ్ డొమైన్ కూడా తిరుపతి బాలాజీ పేరుతో ఉండబోతుంది. శ్రీవారి భక్తులు ఎవరు కూడా దుష్ప్రచారాలు నమ్మకండి.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Review of TTD Online Booking Website Performance – TTD Evo Jawahar Reddy, Additional Evo Dharmareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page