సింహపురి ప్రజలకు అత్యాధునిక సదుపాయాలు-జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

0 8,753

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు రెడ్ క్రాస్ నందు సింహపురి ప్రజలకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పేర్కొన్నారు. స్థానిక రెడ్ క్రాస్ జిల్లా శాఖ కార్యాలయంలో పలు నూతన కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూరు రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో 2  కోట్ల 15 లక్షల విలువైన 20 అత్యాధునిక బైపాస్ వెంటిలేటర్లును అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమన్నారు. చిన్న పిల్లలకు సైతం ఈ అత్యాధునిక సదుపాయాల ద్వారా హాస్పిటల్స్ లోనే కాకుండా ఇంటి వద్ద కూడా చికిత్స పొందే అవకాశం కల్పించడం సంతోషకర విషయం అన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నందు ఇప్పటివరకు ఉన్నటువంటి సదుపాయాలతో పాటు ప్రత్యేకంగా మహిళాభ్యుదయం కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలలో ఆత్మస్థైర్యం ఆర్థిక అభివృద్ధి స్వయం సాధికారత సాధించుకొని జీవన విధానంలో మార్పు తీసుకు రావడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కువైట్ తో బాధపడుతున్న వారికి లేదా కోడ్ నుంచి రికవరీ అయినప్పటికీ ఆక్సిజన్ సరిగా అందక ఇబ్బంది పడుతున్న 254 మంది రోగులకు ఆక్సిజన్ సేవలు అందించడం జరిగిందన్నారు. మొబైల్ క్రేమటోరియం మిషన్ ద్వారా ఇప్పటివరకు 395 మందికి పైగా ఉచితంగా దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రెడ్ క్రాస్ నందు 52 లక్షల విలువైన అత్యాధునిక కార్డియాక్ లైఫ్ సపోర్ట్ మరియు అత్యాధునిక బైపాస్ ఇన్ లెటర్ కలిగిన అంబులెన్స్ లను ప్రజలకు తొలిసారిగా తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా  జాన్ హో న్స్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో పేద ప్రజలకు మరియు కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు, రాష్ట్ర శాఖ మేనేజర్ కమిటీ సభ్యులు డి రవి ప్రకాష్ , కోశాధికారి ఇ సురేష్ కుమార్ జైన్, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు  ప్రసాద్ రెడ్డి , రంగయ్య నాయుడు మరియు  వివిధ ప్రాజెక్టుల కన్వీనర్లు  ,కో కన్వీనర్లు ,రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:State-of-the-art facilities for the people of Sinhapuri – District Collector KVN Chakradhar Babu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page