టార్గెట్ గుజరాత్

0 4

గాంధీనగర్ ముచ్చట్లు:

గుజరాత్ ఎన్ని కలు మరికొద్ది నెలల్లోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలూ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. బీజేపీ ఏకంగా ముఖ్యమంత్రిని మార్చి పాటీదార్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. దశాబ్దకాలంగా వస్తున్న విజయాలను రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తుంది. మోదీ, షాలకు గుజరాత్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వారు ప్రత్యేకంగా అక్కడే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు.2017 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించనంతగా గుజరాత్ లో పుంజుకుంది. బీజేపీ సయితం షాక్ తినాల్సి వచ్చింది. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలుండగా బీజేపీ 99 స్థానాలకే పరిమితం చేసింది. కాంగ్రెస్ 66 చోట్ల విజయం సాధించింది. ఒకరకంగా బీజేపీని ఓడించినట్లే అనుకోవాలి. అందుకే ఈసారి గుజరాత్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గుజరాత్ లో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీ కండువా కప్పేసింది.ఇది కాంగ్రెస్ కు అనుకూలమని విశ్లేషకులు సయితం భావిస్తున్నారు. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం అభివృద్ది చేసిందేమీ లేదని కాంగ్రెస్ తన ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది. మరోసారి గుజరాత్ ఎన్నికల ను రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా గుజరాత్ లో కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది.దీనికి తోడు ఇప్పుడు గుజరాత్ లో యువ నేతల జోరు ఎక్కువగా ఉంది. ఇప్పటికే పాటీదార్ల నుంచి హార్థిక పటేల్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన జిగ్నేశ్ మేవానిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగితే ఆ సామాజికవర్గం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుంది. దీంతో పాటు సీపీఐ యువజన విభాగం నేత కన్నయ్య కుమార్ ను కూడా పార్టీలోకి తీసుకుంటున్నారు. వీరిద్దరూ వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. మొత్తం మీద గుజరాత్ లో కాంగ్రెస్ గెలిచేందుకు అవసరమైన అన్ని వ్మూహాలను రచిస్తుంది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Target Gujarat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page