ఈనెల 27న తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలి

0 7,895

మందమర్రి ముచ్చట్లు:

ప్రభుత్వ విద్యారంగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అద్దె ఉపాధ్యాయులను, అధ్యాపకులను రెన్యువల్ చేసి తక్షణమే భర్తీ చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, వసతి గృహాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న తలపెట్టిన బందును విజయవంతం చేయాలని విజెఎస్, జిల్లా కో కన్వీనర్ బచ్చలి ప్రవీణ్ కుమార్, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా రంగం భ్రష్టు పట్టే పరిస్థితి ఉందని ప్రజాధనాన్ని అన్ని వీడియో గన్ చేస్తూ విద్యార్థులను విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.అలాగే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు అయ్యే విధంగా అసెంబ్లీ సమావేశం లో చర్చించి తగు జీవో తీసుకురావాలని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27న తలపెట్టిన బందును విద్యార్థులు ప్రజలు మేధావులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివ, నవీన్, వినయ్, రమ్య, పల్లవి, శ్రీజ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:The bandh on the 27th of this month should be successful

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page