తల్లిదండ్రులను విస్మరిస్తున్న వారు శిక్షార్హులే

0 7,865

– డివిజన్ ట్రిబ్యునల్ అధికారి ,ఆర్డీవో మాధురి.

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

తల్లిదండ్రులను నిరాదరిస్తున్న వారు  వయోవృద్ధుల రక్షణ చట్టం కింద శిక్షార్హులేనని  జగిత్యాల డివిజన్ ఆర్డీవో,ట్రిబ్యునల్ అధికారి ఆర్.డి.మాధురి అన్నారు.శుక్రవారం కోడలు పెట్టె వేధింపులు భరించలేక ఆత్మహత్యలే శరణ్యమని తీవ్ర వేదన పడుతున్న జగిత్యాల నివాసి మేరుగు రాజన్న(68) అనే వృద్ధ దంపతులను తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు,న్యాయవాది హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సిటీజన్స్ ప్రతినిధులు జగిత్యాల డివిజన్ ట్రిబ్యునల్ అధికారి ,ఆర్డీవో  ఆర్.డి.మాధురిని కలిసి వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద ఫిర్యాదు  దాఖలు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ నిరాదరణకు, వేధింపులకు గురిచేస్తున్న వారిని 3 మాసాలు జైలుకు  పంపే అవకాశం ఈ చట్టంలో ఉందన్నారు. ట్రిబ్యునల్  అఫిర్యాదులో  నేను,నా భార్య  వయోవృద్ధులమని ,పక్షవాతం తో భాదపడుతున్నానని,మమ్మల్ని పోశించని,ఎలాంటి భత్యాలు ఇవ్వని నా  చిన్న కోడలు  లలిత బలవంతంగా మా నివాసంలోనే ఉంటూ ఆ ఇల్లు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయమని,నాకు డబ్బులు ఇవ్వాలని ప్రతిరోజు నానా బూతులు తిడుతూ, మమ్మల్ని కొట్టుతున్నదని,ఆ వేధింపులు తట్టుకోలేక పోతున్నామని,సీనియర్ సిటీజన్స్ సంఘ ప్రతినిధులు ఇది పద్ధతి కాదని హితవు చెప్పితే వారినే దూశిస్తూ ,వెల్లగొట్టిందని ,ఆమెపై తగు చర్య తీసుకొని మమ్మల్ని రక్షించకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో వెంటనే  ఆ వృద్ధ దంపతుల రక్షణ చర్యలకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.   ఆ కోడలుకు మంగళవారం ట్రిబ్యునల్ కు హాజరు కావాలని నోటీసు పంపారు.  ఈ కార్యక్రమంలో  సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు అలిశెట్టి ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సింగం గంగాధర్,మాజీ కౌన్సిలర్లు ఏ. సి .ఎస్.రాజు,గాజుల నగేష్, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్  ప్రతినిధులు అక్కినపెళ్లి కాశీనాథం,ఒడ్డెపెళ్లి మురళి,పబ్బా శివానందం,దొంతుల లక్ష్మికాంతం, జిల్లా,డివిజన్, మండల, పట్టణ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Those who neglect their parents are punishable

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page