పుంగనూరు అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయండి -ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

0 9,950

పుంగనూరు ముచ్చట్లు:

 

మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపిపిగా అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి, సంబరాలు చేసుకున్నారు. దివంగత రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరై , ఎమ్మెల్యే నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని పటిష్టపరచాలన్నారు. విబేదాలకు తావులేకుండ పరిపాలన సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిమాజీ వైస్‌ పెద్దిరెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags; Work collectively for the development of Punganur – MLA Dwarakanathareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page