సుభాష్ మృతిపట్ల సమాచారపౌర సంబంధాల శాఖ సంతాపం

0 8,491

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా  పదవీ విరమణ పొందిన ఊటుకూరు సుభాష్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సుభాష్ ను వారం క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రవేటు హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సుభాష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్నారు.సమాచార పౌర సంబంధాల శాఖలో వివిధ హోదాలలో  దాదాపు 35 సంవత్సరాల పాటు సుభాష్ పని చేసి, డైరెక్టర్ గా 2017 లో పదవీ విరమణ చేశారని, అటు ఉన్నతాధికారులు, పాత్రికేయుల మన్ననలు పొందారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలపై  సుభాష్ కు మక్కువ ఎక్కువని అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె తెలిపారు. సుభాష్ కుటుంబానికి మనోస్టైర్యాన్ని కల్పించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు నాగయ్య తెలిపారు. సుభాష్ మృతిపట్ల ఆ శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, కిషోర్ బాబు, సంయుక్త సంచాలకులు డి. ఎస్. జగన్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags:Department of Civil Relations mourns Subhash’s death

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page