పుంగనూరు జెడ్పిటిసిగా జ్ఞానప్రసన్న

0 9,840

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు మండల జెడ్పిటిసిగా జ్ఞానప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం ఆమె చిత్తూరు ఎంపి రెడ్డెప్పతో కలసి ర్యాలీ నిర్వహించారు. చిత్తూరుకు వెళ్లి జెడ్పిటిసి సభ్యురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఆమె భర్త చంద్రారెడ్డి యాదవ్‌ను , ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఆయన సతీమణి వాణిలక్ష్మిలను ఎంపి రెడ్డెప్ప సన్మానించారు. పట్టణంలో బాణసంచాపేల్చి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపిపి ఈశ్వరమ్మ, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శులు చంద్రారెడ్డి యాదవ్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, గ్రానైట్‌ వ్యాపారి నారదరెడ్డి, రమణ, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు, తుంగామంజునాథ్‌, నటరాజ, కాళిదాసు, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, రమణ, యశ్వంత్‌, కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags: Gnanaprasanna as Punganur ZPTC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page