పండుగ సేల్స్ పై ఆశలు

0 8,465

ముంబై ముచ్చట్లు:

పండగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు మన దేశంలో 23 శాతం పెరుగుతాయని కన్సల్టింగ్ కంపెనీ రెడ్సీర్ వెల్లడించింది. ఆన్లైన్ బిజినెస్ కంపెనీల గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ) ఈసారి 900 కోట్ల డాలర్లు దాటుతుందని రెడ్సీర్ అంచనా వేస్తోంది. అంతకు ముందు ఏడాదిలో జీఎంవీ 74 0 కోట్ల డాలర్లు. ఇక ఏడాది మొత్తానికి చూస్తే ఆన్లైన్ బిజినెస్ల అమ్మకాలు 5200 కోట్ల డాలర్ల దాకా అంటే కిందటేడాదితో పోలిస్తే 37 శాతం ఎక్కువగా ఉండొచ్చని రెడ్సీర్ తన రిపోర్టులో వెల్లడించింది. ఆన్లైన్ బిజినెస్లకు కన్జూమర్లు ఎక్కువయ్యారని, కొవిడ్‌‌ తర్వాత అన్ని వస్తువులు కొనడానికీ ఆన్లైన్నే ఇష్టపడుతున్నారని చెబుతూ, ఈ కారణాల వల్లే ఆన్లైన్ కంపెనీల సేల్స్ బాగా పెరుగుతున్నాయని పేర్కొంది. పండగ సీజన్ మొదటి వారంలో జీఎంవీ 30 శాతం పెరిగి 480 కోట్ల డాలర్లను చేరుకుంటుందని ఈ రిపోర్టు వెల్లడిస్తోంది.

- Advertisement -

ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్పై జరిగే మొత్తం అమ్మకాలనే గ్రాస్ మర్చండైజ్ వాల్యూగా చెబుతారు. ఇందులోంచి కాన్సిలేషన్స్, రిటర్న్ చేసిన వాటిని మినహాయిస్తారు. కొవిడ్ రాకతో ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ కొనుగోళ్ల వైపు మళ్లారని, ఇందువల్లే అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని రెడ్సీర్ రిపోర్టు వివరించింది. మరోవైపు టైర్ 2 సిటీల నుంచి గ్రోత్ బాగా ఎక్కువైందని, షాపింగ్ చేసే మొత్తం వ్యక్తులలో 55 నుంచి 60 శాతం మంది ఈ టైర్ సిటీల నుంచే ఉంటారని రెడ్సీర్ అసోసియేట్ పార్ట్నర్ మ్రిగాంక్ గుత్గుతియా చెప్పారు. ఇంకోవైపు ఆఫ్లైన్ రిటెయిల్ కొవిడ్‌‌ ముందు స్థాయికి చేరుకుంటోంది. దీంతో కొంత మంది రిటెయిల్ షాపులకు వెళ్లి కొనుగోలు చేసే అవకాశాలూ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సారి కూడా పండగ సీజన్లో మొబైల్ ఫోన్ల అమ్మకాలే లీడ్లో ఉంటాయని, మొత్తం జీఎంవీలో వీటికి 11 శాతం వాటా (480 కోట్ల డాలర్లు)  ఉందని చెప్పారు. పండగ సీజన్ కోసం చాలా మొబైల్ కంపెనీలు కొత్త ఫోన్లను తెస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ కేటగిరీ సేల్స్ కూడా కిందటేడాదిలోని 14 శాతం నుంచి ఈ ఏడాది 16 శాతానికి పెరుగుతాయని రెడ్సీర్ రిపోర్టు పేర్కొంది. పండగ సీజన్లోనే కొనాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చాలా మంది కన్జూమర్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారని వివరించింది. పండగల సీజన్లో కొత్త లాంఛ్లతోపాటు, ఆఫర్లూ  ఉంటాయనే ఆలోచనతోనే వారు వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. ఈ కేటగిరీలో ఈఎంఐ కొనుగోళ్లు, బై నౌ పే లేటర్ ఈసారి మంచి గ్రోత్ సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. ఫ్యాషన్ కేటగిరీ కూడా మెరుగైన సేల్స్తో దూసుకెళ్ల నుందని రెడ్సీర్ పేర్కొంది.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Hopes on Festive Sales

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page