డబుల్ ఇళ్లలలో ఉండేది ఎలా

0 8,796

కూలుతున్న పెచ్చులు, కారుతున్న ఇళ్లు

హైదరాబాద్ ముచ్చట్లు:

- Advertisement -

పేదవారి సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడింది. ఇండ్లు నిర్మించి రెండేళ్లు గడువక ముందే సవాలక్ష సమస్యలతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత చేస్తాం అంటూ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతలను బడా సంస్థకు అప్పజెప్పి సర్కారు చేతులు దులుపుకుంటే.. సదరు సంస్థ మరొకరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చి నాణ్యతకు తిలోదకాలు వదిలింది. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా డబుల్ ఇళ్లు పూర్తిగా అధ్వాన్నంగా తయారయ్యాయి.కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్, నర్సాపూర్ కూడలిలో ఎకరం స్థలంలో గత మూడు దశబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న చిత్తారమ్మ బస్తీ ప్రజలు వంద మందికి సొంత ఇండ్లను కట్టిస్తామని మొట్టమొదటి సారిగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గుడిసెలను తొలగించి ఆ స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. 2015 అక్టోబర్ 22వ తేదిన దసర కానుకగా చిత్తారమ్మ బస్తీలో అప్పటి రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సుమారు 9.34 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు.

 

2016లో నిర్మాణ పనులను ప్రారంభించి 2019లో పూర్తి చేశారు. 2019 నవంబర్ 14వ తేదిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి, లబ్దిదారులకు అందజేశారుడబుల్ బెడ్రూం ఇండ్లలో గృహ ప్రవేశం చేసిన సంతోషం లబ్దిదారులకు ఎంతో కాలం నిలవలేదు. ఇండ్లలో డ్రైనేజీ లీకులు, సిమెంట్ ఫ్లోరింగ్ నాణ్యత లోపించడంతో గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు గోడలు చెమ్మగిల్లి నీరు కారుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. కొంత మంది తమ స్థోమతను బట్టి ఫ్లోరింగ్ తీసేసి టైల్స్ వెయించుకోగా, మిగిలిన వారు పెచ్చులు లేసి అధ్వాన్నంగా ఉన్న ఫ్లోర్‌తోనే సర్దుకుపోతున్నారు.తొమ్మిది అంతస్థుల నిర్మాణంలో మొత్తం 105 ఇండ్లను ప్రభుత్వం నిర్మించగా అందులో ప్రస్తుతం మొత్తం 94 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాగా అందరికీ నీటి వసతి కోసం నిర్మించిన నీటి ట్యాంకుల లీకేజీతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. కాంట్రాక్టర్కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా పైపైన సిమెంట్ పూసి, తాత్కాలిక మరమ్మత్తులు చేయించాడని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా మిద్దెపై గుంతలు, బీటలకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో మిద్దె పై భాగం పూర్తిగా అతుకులుగా మారి దర్శనమిస్తోంది.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను ప్రముఖ సైబర్ సిటీ డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. తర్వాత సైబర్ సిటీ సంస్థ సుకుమార్ అనే మరో వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ కింద నిర్మాణ పనులను అప్పగించింది. దీంతో సదరు కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యాంగ నిర్మాణ పనులను నాసిరకంగా పూర్తి చేసి మమ అనిపించాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా లబ్దిదారులు సైబర్ సిటీ నిర్మాణ సంస్థకు, సుకుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:How it was in double homes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page