నూతన ప్రజాప్రతినిధులు అభివృద్ధి వైపు దృష్టి సారించాలి -మంత్రి పెద్దిరెడ్డి

0 9,466

పుంగనూరు ముచ్చట్లు:

 

నూతన ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారందరు ఇక మీదట అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని ప్రతిఇంటికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. శనివారం చిత్తూరు ఎంపి రెడ్డెప్ప ఆధ్వర్యంలో పుంగనూరు నూతన ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి ఈశ్వరమ్మ , ఎంపిటిసిలు తిరుపతికి వెళ్లి మంత్రిని కలిశారు. మండల పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , జెడ్పిటిసి కలసి ప్రతి గ్రామంలోను పర్యటించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు అందించాలన్నారు. సచివాలయాలను సందర్శిస్తూ , ఉద్యోగులను , వలంటీర్లచే పథకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. గ్రామాల్లో వెహోక్కలు నాటి, సంరక్షించే కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలన్నారు. సమస్యలను రికార్డు రూపంలో తయారు చేయాలన్నారు. అవసరమైన వాటిని తక్షణమే పరిష్కరించేలా ప్రజలకు తెలపాలన్నారు. నిర్లక్ష్యం వహించినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు. మంత్రిని కలిసిన వారిలో ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు సుబ్రమణ్యయాదవ్‌, చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, రమణ, నరసింహులు, నజీర్‌, సుబ్రమణ్యం ఉన్నారు.

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags: New MPP should focus on development – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page