సాగర్ కు కొనసాగుతున్న వరద నీరు

0 5,803

నల్గోండ ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా పరిధిలోని భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు.. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ ఫ్లో రూపంలో 98,144 క్యూసెక్కులు వస్తుండడంతో ప్రస్తుతం 6 గేట్స్ ఓపెన్ చేసి.. ప్రధాన జల విద్యుత్ కేంద్రం, కుడి-ఎడమ కాలువలు, ఎస్ఎల్బిసి, వరద కాలువ ద్వారా అవుట్ ఫ్లో 98,144 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతo నీటిమట్టం 589.70అడుగులుగా ఉంది. అలాగే డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 312.45 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిలువ 311.14 టీఎంసీలకు చేరుకుంది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Ongoing flood water to Sagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page