ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని గెలుచుకున్న  “తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ”

0 8,799

-అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:

- Advertisement -

ఈ సంవత్సరం జరిగిన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్నది.సెప్టెంబర్ 21 న జరిగిన ఈ పోటీలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫ్లైయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా రోలింగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని అధికారులు ఆయన అధికార నివాసంలోమర్యాదపూర్వకంగా కలిసారు.తెలంగాణ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్న అవార్డును  అకాడమీ సీ.ఈ.ఓ అండ్ సెక్రటరీ ఎస్.ఎన్. రెడ్డి   మంత్రి కి అందించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు. 2003 సంవత్సరం లో ఈ ట్రోఫీని ఏర్పాటు చేసినట్లు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కెప్టెన్ అనీషా సురేష్ తెలిపారు.దేశవ్యాప్తంగా 21 ఫ్లయింగ్ ట్రైనింగ్ క్లబ్లు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్నాయని, ఏవియేషన్ పైలట్లు మరియు ఇంజనీర్లకు అబ్-ఇనిషియో శిక్షణకు సంబంధించి ఈ ఫ్లయింగ్ క్లబ్లు విలువైన సేవలను అందిస్తున్నాయన్నారు. ఒడిషాలోని జుహు కేంద్రంగా బాంబే శిక్షణ సంస్థ ఈ కార్యకలాపాలు నిర్వాహిస్తున్నది. ఈ ట్రోపిలో ఫ్లయింగ్ క్లబ్ రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి ప్రభుత్వ విమానయానానికి లభించిందని అధికారులు మంత్రి కి వివరించారు.

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags:”Telangana State Aviation Academy” wins Aero Club of India Trophy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page