వీరవాసరంలో ఎంపీటీసీల ప్రమాణస్వీకారం

0 8,794

భీమవరం ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో ఎంపిటిసిలు ప్రమాణస్వీకారం చేసారు. ఎంపీపీ అభ్యర్థి ఎన్నుకునే సమయంలో వైసిపి కి సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థులు గైరు హాజరయ్యారు రిటర్నింగ్ అధికారి అభ్యర్థులను మరల ఎంపీపీ కి వైస్ ప్రెసిడెంట్ కి ఎవరైనా పోటీ అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించి లేరని వారందరూ తెలుపగా ఎంపిపి అభ్యర్థిగా వీరవల్లి దుర్గ భవాని(టీడీపీ ), వైస్ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి (జనసేన ) కో ఆప్షన్ సభ్యులుగా సయ్యద్ మస్తాన్ వలి(జనసేన ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పిటిసి జనసేన నుండి గెలిచిన అభ్యర్థి గుండా జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ  ప్రభుత్వం చేసే తప్పుల వలన ప్రజలు విసుకు చెందారని అందువల్లే వీరవాసరం లో జనసేన దాని మిత్రపక్షాలు తిరుగులేని మెజారిటీతో గెలిచామని జనసైనికులు కార్యకర్తలు ఇతర పార్టీల వారు చేసిన కృషని, ఈ వీరవాసరం మండలాన్ని మోడల్ గా తీసుకుని రాష్ట్రమంతా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అందుకు ప్రజలు, పార్టీ నాయకులు జనసేనకి సహకరిస్తారని, కోరుకుంటూ మా అధినేత పవన్ కళ్యాణ్   ఆదేశాలతో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామని ఇకముందు కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, వీరవాసరం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:The swearing in of MPTCs in Veeravasaram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page