బతికేపల్లిలో మన ఊరు – మన అంగన్వాడీ కేంద్రం సందర్షన

0 8,878

-సర్పంచ్ శోభారాణి వినూత్న కార్యక్రమం

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణులకు మెనూ ప్రకారం సరుకులు, భోజనం పెడుతున్నారా లేదా, కేంద్రాలు సక్రమంగా నడిచేలా బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి  వినూత్నగా  జగిత్యాల జిల్లాలో మన ఊరు – మన అంగన్వాడీ కేద్రం సందర్షన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలోని 6వఅంగన్వాడి సెంటర్ ను శనివారం పంచాయతీ కార్యదర్శి ప్రేమలత , వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి సందర్శించి కేంద్రం నడుస్తున్న తీరు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం, పిల్లల హాజరు తదితర విషయాలను టీచర్, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం  నిర్వహణ, మెనూ ప్రకారం పిల్లలకు భోజనం, పోషకహరo సరుకులను అంధుస్తుండo పట్ల సర్పంచ్ శోభారాణి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా సర్పంచ్ శోభారాణి, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత పిల్లలతో కలిసి అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేశారు. మూడు నుండి ఐదు సంవత్సరముల లోపు పిల్లలను అంగన్వాడి స్కూల్స్ కు పంపించాలని శోభారాణి  సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కోడిపెల్లి జమున, వార్డు సభ్యులు జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags:Visit our hometown – our Anganwadi Center in Bathikepally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page