శృంగేరీపీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరభారతి మహాస్వామిని నమస్కరిస్తున్నతల్లితండ్రులు

0 8,797

విజయవాడముచ్చట్లు:

 

కుమారుడు సన్యసించుటకు సాధారణంగా తల్లి అనుమతి తప్పనిసరి. సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైన ఆది శంకరులే సన్యసించుటకు వారి తల్లిగారు మొదట అనుమతించలేదు.తల్లిదండ్రుల అనుమతి పొంది, శ్రీ శృంగేరి పీఠానికి ఉత్తరాదిఖారి యైనారు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు.ఎవరైతే సన్యాసం తీసుకుంటారో, ఆ సన్యాసి యొక్క పూర్వాశ్రమ తండ్రి అయినా సరే , మన సనాతన ధర్మం ప్రకారం, ఆ సన్యాసికి తగు మర్యాదతో నమస్కరించాల్సిందే.కానీ, మాతృ మూర్తి విషయానికి వచ్చే సరికి…అదే సన్యాసి తన పూర్వాశ్రమ తల్లికి సాష్టాంగ ప్రాణామం చేయాలి. పుత్రడు సన్యాసాశ్రమం తీసుకున్నాక తండ్రి అనే బంధం నుంచి విడిపోతాడు. కానీ తల్లి విషయంలో మన సనాతన ధర్మం ఇంతటి గౌరవ స్థానం కల్పించింది.పూర్వాశ్రమంలో స్వామివారు తల్లిదండ్రులు ఇలా దర్శించుకునే అపూర్వ సన్నివేశం మనసును ఆధ్యాత్మిక తరంగలలో ఒలలాడిస్తోంది. తండ్రి గారు నమస్కరించినప్పుడు స్వామివారి ముఖంలో దరహాసం, తండ్రిగారి మొహంలో సంతృప్తి వ్యక్తమవుతుండగా, తల్లి గారి ఆనందానికి అవధులు లేవు.

 

- Advertisement -

భారతీయ సనాతన ధర్మం అనుసరించి, వేదసంప్రాదయంలో తల్లికి విశిష్ట మైన స్ధానం ఉంది.అందుకే తల్లి నమస్కారం చేయదు.భగవత్ పాదులైన ఆదిశంకరులైనా ..తండ్రి చేయవచ్చు.దేవుడు ప్రతి ఇంట్లో కొలువై ఉండలేక అమ్మను సృష్టించాడు.మనుస్మృతిలో కూడా ఇలా చెప్పారు…యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః!యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రీయాః!!ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ప్రసన్నులౌతారు. ఏ కుటుంబంలో స్త్రీలను అగౌరవపరుస్తారో అక్కడ వారు చేపట్టే పనులన్నీ నిష్ఫలమౌతాయి.అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్షాత్ దేవుడే,సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం,అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం..

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags:Parents saluting Sri Sri Sri Vidhusekharabharati Mahaswamy, the successor of Sringeri Peetha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page