పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

0 9,735

పుంగనూరు ముచ్చట్లు:

 

మండల ఎంపిపిగా ఎన్నికైన అక్కిసాని భాస్కర్‌రెడ్డిని ఉపాధ్యాయులు ఆదివారం సన్మానించారు. ఎంఈవో కేశవరెడ్డి, మండల ఎస్టీయు అధ్యక్షుడు హరికిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భాస్కర్‌రెడ్డికి శాలువ కప్పి , పూలమాలలతో సన్మానించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, మరింత నాణ్యమైన బోధన చేయాలని , ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి, ఆదర్శమైన మండలంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు దామోదరం, మోహన్‌, బుడ్డన్న, మంజునాథ్‌, సుధాకర్‌, ప్రభాకర్‌, దీపారాణి, రేవతి, పద్మజ, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, వైస్‌ఎంపిపిలు

Tags: Teachers honoring new MP Bhaskar Reddy of Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page