అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి-బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి రవీందర్ రెడ్డి

0 5,798

జగిత్యాల  ముచ్చట్లు:

పట్టణంలో నిర్మిస్తున్న పలు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి రవీందర్ రెడ్డి సోమవారం కలెక్టర్ ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని ఎస్ ఆర్ ఎస్ పి క్యాంప్ లో నిర్మిస్తున్న చర్చి వెనక అక్రమ నిర్మాణాలపై తీసుకోవాలని కోరారు. పలు వార్డుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సెట్‌ బ్యాక్ లేకుండా నిర్మాణము చేయుచున్నారని ఈ విషయమై ఇది వరకే జగిత్యాల జిల్లా కలెక్టర్ దరఖాస్తు అందించామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అట్టి అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కలెక్టర్ ఆదేశాలతో కొన్ని నిర్మాణాలను ఎలా కుల్చారో అధికారపార్టీ కి చెందిన అక్రమ నిర్మాణాలు కూడా అలాగే తొలగించాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోగలరని ప్రజల పక్షాన విన్నవించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్రం రాము, జిట్టవేని అరుణ్ కుమార్, బిట్టు, గట్టిపెల్లి జ్ఞనేశ్వర్, థరూర్ గంగారాం, సిరికొండ నరేష్ , చుక్క అశోక్, వెంకట్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Action should be taken against illegal structures – BJP constituency in-charge Ravinder Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page